Budget 2019: పీఎంఏవై పథకం కింద 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం

2019లో ప్రధానంగా సామాన్యులకు గృహ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారంచింది. పీఎంఈవై పథకం కింద 2020 నుంచి 2022 నాటికి మొత్తం 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

news18-telugu
Updated: July 5, 2019, 12:34 PM IST
Budget 2019: పీఎంఏవై పథకం కింద 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం
నరేంద్ర మోదీ (File)
news18-telugu
Updated: July 5, 2019, 12:34 PM IST
కేంద్ర బడ్జెట్ 2019లో ప్రధానంగా సామాన్యులకు గృహ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారంచింది. పీఎంఈవై పథకం కింద 2020 నుంచి 2022 నాటికి మొత్తం 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే 2022 నాటికి ప్రతీ ఇంటికి విద్యుత్ అందిస్తామని తెలిపారు. అలాదగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీం కింద ఇప్పటికే 80,250 కోట్ల మేర ఖర్చుచేసామని నిర్మలా తెలిపారు. అలాగే మరో 30 వేల కోట్ల రోడ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వ్యవస్థను ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా తెలిపారు.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...