హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget: కేంద్ర బడ్జెట్ లో కామన్ మ్యాన్ కు పనికొచ్చే హైలైట్స్ ఇవే

Union Budget: కేంద్ర బడ్జెట్ లో కామన్ మ్యాన్ కు పనికొచ్చే హైలైట్స్ ఇవే

కేంద్ర ప్రభుత్వం గతంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాల ప్రకారం రూ. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణ పేదలు ఈ కోటా కింద రిజర్వేషన్ పొందేందుకు అర్హులు.

కేంద్ర ప్రభుత్వం గతంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాల ప్రకారం రూ. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణ పేదలు ఈ కోటా కింద రిజర్వేషన్ పొందేందుకు అర్హులు.

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman ఎటువంటి తాయిలాలు ప్రకటించలేదు కానీ ఆర్థికరంగానికి కొత్త జవసత్వాలు తెచ్చే చర్యలు మాత్రం పకడ్బందీగా రచించారు. కామన్ మ్యాన్ కు పనికొచ్చే అలాంటి టాప్ పాయింట్స్ ఏంటో మీరే చదవండి..

ఇంకా చదవండి ...

ఇన్ కం ట్యాక్స్ స్లాబుల్లో ఎటువంటి మార్పు చేయని కేంద్ర బడ్జెట్ 2021-2022 Union Budget 2021 లో సామాన్యులకు కొన్ని ఊరటలు మాత్రం లభించాయి. కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman ఎటువంటి తాయిలాలు ప్రకటించలేదు కానీ ఆర్థికరంగానికి కొత్త జవసత్వాలు తెచ్చే చర్యలు మాత్రం పకడ్బందీగా రచించారు. కామన్ మ్యాన్ కు పనికొచ్చే అలాంటి టాప్ పాయింట్స్ ఏంటో మీరే చదవండి..

NRIలకు డబుల్ ట్యాక్స్ నుంచి ఊరట..

నాన్ రెసిడెంట్ ఇండియన్లు మనదేశానికి తిరిగి వచ్చినప్పుడు విదేశంతో పాటు ఇక్కడా ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎన్నో చిక్కులకు దారితీస్తుండగా, ప్రవాస భారతీయులకు ఆర్థిక భారాన్ని మిగులుస్తోంది. ఈనేపథ్యంలో వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బడ్జెట్ లో ప్రకటించటం ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.

సీనియర్ సిటిజన్లకు..

75ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు కేంద్ర బడ్జెట్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. పెన్షన్, పొదుపు పథకాలపై వడ్డీతో జీవించే 75 ఏళ్ల పైబడ్డ సీనియర్ సిటిజన్లు ఇకపై ఎలాంటి ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాల్లోనే వారి పన్ను మొత్తానికి మినహాయింపు లభిస్తుంది. ఇంటి అద్దెలు వంటివాటిపై ఆధారపడే సీనియర్ సిటిజన్లు, పోర్ట్ ఫోలియో ఈక్విటీస్ లో పెట్టబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తుంటారు.

ప్రీ-ఫిల్డ్ ట్యాక్స్ ఫార్మ్స్..

ఇక ఆదాయపన్ను ఫైలింగ్ మరింత సరళతరం చేస్తూ ప్రీఫిల్డ్ ట్యాక్స్ ఫార్మ్స్ ను కేంద్రం అందుబాటులోకి తేనుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ గెయిన్స్, బ్యాంకు పొదుపు ఖాతాలు, పోస్టాఫీసులపై ప్రీఫిల్డ్ ట్యాక్స్ ఫార్మ్స్ ను అమలుచేస్తారు. టీడీఎస్ తో పాటు ఇలాంటి ప్రీ ఫిల్డ్ ట్యాక్స్ ఫార్మ్స్ విధానాన్ని అవలంభించటం ద్వారా ట్యాక్సులను చాలా సమర్థవంతంగా ఫైలింగ్ చేయటం సాధ్యమవుతుంది.

ఫేస్‌లెస్ అసెస్మెంట్స్..

ఫేస్‌లెస్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బడ్జెట్. 50 లక్షల రూపాయల పైబడ్డ్ ఆదాయం ఉన్నవారు, డిస్ప్యూటెడ్ ఇన్‌కం 10 లక్షల రూపాయల వరకు ఉంటే వీరంతా ఈ కమిటీని సంప్రదించేలా చర్యలు తీసుకోనున్నారు.

సొంతిల్లు..

హోం లోన్ మరింత ఈజీగా తక్కువ వడ్డీకి వచ్చేలా ప్రోత్సాహకాలు కల్పించే వాతావరణాన్ని కేంద్రం సృష్టించనుంది. సరసనమైన ధరలకు ఇల్లు సొంతం చేసుకునే అవకాశాలు కల్పించేలా ఊతమిస్తోంది కొత్త బడ్జెట్. 2022, మార్చ్ 31 వరకు హౌజింగ్ లోన్లు తీసుకునేవారికి పలు విధాల లాభం కలిగేలా హోం లోన్ పై వడ్డీ రేట్లను తగ్గించేలా బడ్జెట్ చర్యలు తీసుకోనుంది.

మౌలిక రంగంలో ..

ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వృద్ధి కోసం బడ్జెట్ పెద్ద కసరత్తే చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ ద్వారా నిధులు సమీకరించేలా మౌలిక రంగం ముఖచిత్రాన్ని కేంద్రం మార్చింది. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్లు ఇక ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టి లాభాలా ఆర్జించవచ్చు. ఇందుకు అనుగుణంగా ట్యాక్స్ ఎఫిసియంట్ జీరో కూపన్ బాండ్స్ ను జారీ చేయనున్నారు. ఇవి ఇన్కంట్యాక్స బెనిఫిట్లు కూడా ఇవ్వనుండటం విశేషం.

సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్

కోవిడ్-19 ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి సామాజిక భద్రతను కల్పించేలాఫ్రీలాన్సింక్ అసైన్మెంట్లు కల్పిస్తూ ఊరటనిచ్చేలా బడ్జెట్ లో కీలక ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ వర్కర్లను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ) గొడుగు కిందకు తెచ్చి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వర్తించేలా చేస్తూ, కనీస వేతనాలు చెల్లించేలా నిబంధనలు అమలు చేయనున్నారు. నైట్ షిఫ్టుతో పాటు అన్ని షిఫ్టులు, కేటగెరీల్లో మహిళలా ఉద్యోగులకు ఉపాధి కల్పించేలా అవకాశాలు కల్పించనున్నారు.

ఇన్వెస్ట్ మెంట్ చార్టర్..

మిస్-సెల్లింగ్ ఫైనాన్షియల్ ప్రాడక్ట్స్ ద్వారా నష్టాలు సంభవించకుండా ఉండేందుకు ఇన్వెస్ట్మెంట్ చార్టర్ ను ప్రారంభించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాలను ఆర్థిక శాఖ ఇంకా వెల్లడించాల్సి ఉంది. కానీ దీన్నిబట్టి పెట్టుబడిదారులకు హక్కులను, వారి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ లభిస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేనున్న కొత్త పాలసీ ద్వారా బ్యాంకు డిపాజిటర్ల పొదుపుకు మరింత భద్రత, ఇన్సూరెన్స్ లభించనుంది. బ్యాంకులు ఏవైనా ఆర్థిక సంక్షోభంలో మునిగినా కస్టమర్ల భద్రతకు ఢోకా లేకుండా ఉండేలా ఇది పనిచేస్తుంది. బ్యాంకు డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు గతేడాది బడ్జెట్ లో పెంచారు. బ్యాంకులు పీకల్లోతు కష్టాల్లో మునిగినప్పుడు మారటోరియం విధించిన ఆర్బీఐ చర్యలతో బ్యాంకు డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందులకు గురికాగా భవిష్యత్తులో అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా కొత్త చర్యలకు శ్రీకారం చుట్టేలా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది.

First published:

Tags: Budget 2021

ఉత్తమ కథలు