భారతదేశ బ్యాంకింగ్ దిగ్గజం యూనియన్ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారా...ఆ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డును కలిగి ఉన్నారా? నెట్ బ్యాంకింగ్, మెుబైల్ యాప్ లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం జనవరి 8 నుంచి 11 వరకూ బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు యొక్క ఐటి వ్యవస్థల అప్‌గ్రేడ్ కారణంగా, గుర్తించబడిన కొద్ది మంది వినియోగదారుల కోసం 08 జనవరి 2021 న రాత్రి 10:00 నుండి 20 జనవరి 11 న ఉదయం 06:00 వరకు ఇంటర్నెట్ / మొబైల్ బ్యాంకింగ్‌తో సహా ఎటిఎంలు మరియు ఆన్లైన్ సేవలకు అంతరాయాలు ఉండవచ్చు. మీ శాఖతో సహా శాఖలు. అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము మరియు తదనుగుణంగా ప్లాన్ చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అంటూ ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే బ్యాంక్ తన వినియోగదారులకు సందేశాలను పంపినట్లు తెలిపింది. షెడ్యూల్ మెయింటెనెన్స్ కు సంబంధించిన హెచ్చరికలను అధికారిక వైబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది.
గతంలో కూడా సాంకేతిక లోపాల కారణంగా నెట్ బ్యాంకింగ్,మెుబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగిందని, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పింది. అలాంటి ఇబ్బందులను మళ్లీ కస్టమర్లులు ఎదురుకోకుండా ముందుగానే హెచ్చరిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ తెలిపింది.
Published by:Krishna Adithya
First published:January 08, 2021, 17:28 IST