news18
Updated: November 2, 2020, 8:58 AM IST
(ప్రతీకాత్మక చిత్రం)
- News18
- Last Updated:
November 2, 2020, 8:58 AM IST
కొత్తగా ఇళ్లు కొనాలనుకునేవారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) శుభవార్త చెప్పింది. రూ. 30 లక్షలకు మించిన గృహ రుణాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వడ్డీరేటును భారీగా తగ్గించింది. రూ. 30 లక్షలకు మించి ఇంటి రుణాలు తీసుకునే వారికి తన వడ్డీరేటును 10 బిపిఎన్ తగ్గించినట్టు యూబీఐ పేర్కొంది. అయితే మహిళల కోసం మరో ప్రత్యేక ఆఫర్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కేటగిరీ కింద రుణాలు పొందాలనుకునే మహిళలకు మరింత ఎక్కువ వడ్డీరేటు రానుంది.
గృహ రుణాలు తీసుకునే మహిళలకు రుణం కోసం 10 బిపిఎస్ తో పాటు.. మరింత ఎక్కువ వడ్డీరేటు తగ్గింపుగా.. మరింత 5 బిపిఎస్ రాయితీ పొందుతారు. 2020 డిసెంబర్ 31 వరకు గృహ రుణాల కోసం జీరో ప్రాసెసింగ్ ఛార్జీలుంటాయి. దీనికి తోడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలను స్వాధీనం చేసుకుంటే రూ. 10 వేల లీగల్ మరియు వాల్యూయేషన ఛార్జీలు కూడా మాఫీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ఈ వడ్డీ రాయితీలు 2020 నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కారు మరియు విద్యా సంబంధింత రుణాలకు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేయబోమని బ్యాంకు పేర్కొంది. వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు గానూ రిటైల్, ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార పరిశ్రమలు) లకు రుణాలను అందించడానికి ప్రచారాలను కూడా ప్రారంభించింది.
పండుగ సీజన్ కావడతో రుణాలు తీసుకునే వాళ్లు బ్యాంకు అందించే తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని బ్యాంకు ఆశిస్తున్నది. ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
Published by:
Srinivas Munigala
First published:
November 2, 2020, 8:55 AM IST