హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank News: ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్!

Bank News: ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్!

 Bank News: ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్!

Bank News: ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్!

LIC Mutual Fund | మీకు ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్‌లో అకౌంట్‌లో అకౌంట్ ఉందా? అయితే మీకు శుభవార్త. బ్యాంక్ తాజాగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Banks | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) తాజాగా తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్‌తో (Mutual Funds) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్టులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. అంటే బ్యాంక్ కస్టమర్లకు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ సర్వీసులు పొందొచ్చు.

బ్యాంకుల విలీనం తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పనితీరు నమోదు చేస్తోంది. థర్డ్ పార్టీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ భాగస్వామ్య సంస్థలతో కలిసి పని చేస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కస్టమర్లకు మెరుగైన ప్రొడక్టులు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది.

ఎస్‌బీఐ బంపరాఫర్లు.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీలపై రూ.12 వేల డిస్కౌంట్!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సంజయ్ నారాయణ్ మాట్లాడుతూ.. కస్టమర్లకు బెస్ట్ ప్రొడక్టులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్భన్ ప్రాంతాల్లో కస్టమర్లకు ఈ భాగస్వామ్యం వల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

భారీ తగ్గింపు ఆఫర్లు.. కారు కొంటే ఏకంగా రూ.63,000 డిస్కౌంట్!

ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో టీఎస్ రామక్రిష్ణన్ మాట్లాడుతూ.. తమ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్టులు అన్నీ యూనియన్ బ్యాంక్ బ్రాంచుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో బ్యాంక్ బ్రాంచులు ఎక్కువగా ఉన్నాయని, దీని వల్ల ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావొచ్చని ఆయన వివరించారు.

కాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 8729 బ్రాంచులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది నాలుగో అతి పెద్ద బ్యాంక్. బ్యాంక్ మొత్తం బిజినెస్ విలువ 2022 సెప్టెంబర్ నాటికి 18 ట్రిలియన్ దాటిపోయింది. ఇకపోతే ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అనేది 1989 ఏప్రిల్ 20న ప్రారంభం అయ్యింది. ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇది ఒకటి. ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో ఇది కూడా ఒకటిగా ఉంది. దిగ్గజ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) దీన్ని స్పాన్సర్ చేస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ మధ్య కుదరిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరు సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది.

First published:

Tags: Banks, Mutual Funds, Union bank of india

ఉత్తమ కథలు