UNION BANK OF INDIA RUPAY WELLNESS CREDIT CARD OFFERS FREE HEALTH CHECK UP AND DISCOUNTS AT GYM KNOW THIS CREDIT CARD DETAILS SS GH
Credit Card: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఫ్రీ హెల్త్ చెకప్... జిమ్‌లో భారీ డిస్కౌంట్ కూడా
Credit Card: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఫ్రీ హెల్త్ చెకప్... జిమ్‌లో భారీ డిస్కౌంట్ కూడా
Credit Card | కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లోకి సరికొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. ఈ క్రెడిట్ కార్డ్ (Credit Card) తీసుకుంటే ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. జిమ్‌లో భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) సరికొత్త క్రెడిట్ కార్డును (Credit Card) అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో చేతులు కలిపిన యూబీఐ.. యూనియన్ బ్యాంక్ రూపే వెల్నెస్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును (Contactless Credit Card) లాంచ్ చేస్తోంది. కస్టమర్ల లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ కోసం క్రెడిట్ కార్డును వాడటం కోసమే ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా.. కస్టమర్లు.. తమ ఫిట్నెస్, ఆరోగ్యం, పర్సనల్ కేర్, లైఫ్ స్టైల్ మీద దృష్టి పెడతారు. పర్సనల్ కేర్ కోసం ఈ క్రెడిట్ కార్డును వాడి... భారీ డిస్కౌంట్ లను పొందే అవకాశం ఉందని యూబీఐ ఎండీ, సీఈవో రాజ్ కిరణ్ రాయ్ స్పష్టం చేశారు. ‘ప్రతి ఒక్కరు ఫిట్‌గా ఉండాలని అనుకుంటారు. పర్సనల్ కేర్ మీద దృష్టి పెడతారు. అటువంటి వాళ్ల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్రెడిట్ కార్డు ఇది. వెల్ నెస్ ప్యాకేజ్‌లు చాలా వరకు ఈ కార్డు ద్వారా సేవ్ చేసుకోవచ్చు’ అని ఎన్పీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ వెల్లడించారు.
యూనియన్ బ్యాంక్ రూపే వెల్ నెస్ క్రెడిట్ కార్డు ద్వారా, దేశ వ్యాప్తంగా సెలక్ట్ చేసిన జిమ్ సెంటర్లలో.. 15 నుంచి 30 రోజుల వరకు కాంప్లిమెంటరీ జిమ్ మెంబర్ షిప్‌ను క్రెడిట్ కార్డు హోల్డర్లు పొందొచ్చు. ఇప్పటికే ఆయా జిమ్ లలో మెంబర్స్‌గా ఉన్నవాళ్లకు మెంబర్షిప్ రెన్యువల్ సమయంలో 40 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే.. దేశంలోని టాప్ సిటీలలో ఉన్న గోల్ఫ్ కోర్సులలో కూడా ఈ కార్డు ద్వారా యాక్సెస్ ఉంటుంది. ఒక సంవత్సరంలోపు ఒక కాంప్లిమెంటరీ గోల్ఫ్ గేమ్ కూడా అందిస్తారు.
ఈ కార్డు హోల్డర్స్‌కు ఒక సంవత్సరంలో ఒక కాంప్లిమెంటరీ ప్రీమియం హెల్త్ చెకప్ ప్యాకేజ్ ఉంటుంది. కాంప్లిమెంటరీ ప్యాకేజీని ఒక సంవత్సరంలో ఉపయోగించుకుంటే.. తర్వాత మరోసారి చెకప్‌కు భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ప్రతి సంవత్సరం కాంప్లిమెంటరీ వెల్ నెస్ ట్రీట్ మెంట్ తో పాటు ప్రతి నెలా స్పా సెషన్స్ కు యాక్సెస్ కూడా ఉంటుంది.
దేశంలోని 30 డొమెస్టిక్ ఎయిర్ పోర్టుల్లో ఉన్న లాంజ్లలో 3 నెలల్లో రెండు సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. ఈ కార్డులో ఎన్నో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్డు ద్వారా డొమెస్టిక్ గా, అంతర్జాతీయంగా.. భారీ డిస్కౌంట్లతో వెల్నెస్కు సంబంధించిన సెంటర్లలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ ఫీచర్లతో ఇప్పటి వరకు ఏ క్రెడిట్ కార్డు రాలేదని జేసీబీ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ యోషికి కనెకో వెల్లడించారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.