Home /News /business /

UNION BANK LAUNCHES MSME FESTIVE BONANZA IN HYDERABAD KHAZAGUDA MK

Union Bank of Indiaలో MSME Festive Bonanza ప్రారంభం...సులభ తక్షణ రుణాలకు ఇదే సువర్ణావకాశం

Union Bank of Indiaలో MSME Festive Bonanza ప్రారంభం..

Union Bank of Indiaలో MSME Festive Bonanza ప్రారంభం..

హైదరబాద్ లోని ఖాజాగుడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక MSME Festive Bonanza క్రెడిట్ క్యాంప్ ప్రారంభమైంది. ఈ కాంపెయిన్ కింద డిసెంబర్ మాసంలో ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ లోన్ మేళ నిర్వహించనున్నారు.

    హైదరబాద్ లోని ఖాజాగుడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ప్రత్యేక MSME Festive Bonanza క్రెడిట్ క్యాంప్ ప్రారంభమైంది. ఈ కాంపెయిన్ కింద డిసెంబర్ మాసంలో ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ లోన్ మేళ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతూ భారత ఆర్థిక వ్యవస్థకు MSME రంగం అందిస్తున్న సహకారం గురించి Hyderabad zone Chief General Manager కబీర్ భట్టాచార్య వివరించారు. బుధవారం ఖాజాగుడాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ప్రత్యేక MSME క్రెడిట్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎంఈ రంగ అభివృద్ధికి యూనియన్‌ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు కొత్త పథకాలు తీసుకొస్తోందన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటుంది అలాగే దేశవ్యాప్తంగా వ్యాపారం ఊపందుకుంది. ఈ క్రమంలో, బ్యాంక్ MSME ఫెస్టివ్ బొనాంజా పథకాన్ని (MSME Festive Bonanza) ప్రారంభించింది.



    ఈ పథకం కింద, కస్టమర్‌లు రూ. 25 లక్షల కంటే ఎక్కువ వ్యాపార రుణాలపై 6.80 నుండి 7.40 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ప్రాసెసింగ్ ఛార్జీలలో మినహాయింపు పొందుతారు. అలాగే వివిధ ముద్రా రుణాలు, ఇతర చిన్న పరిశ్రమల రుణాలు ఈ ఫెస్టివల్ బొనాంజా ద్వారా అందించనున్నారు.



    ఇదిలా ఉంటే MSME Festive Bonanza కింద ఇప్పటికే ఖాజాగుడా శాఖకు అనేక రుణ దరఖాస్తులు రాగా, వాటిలో అర్హులకు రుణాల దరఖాస్తులకు సత్వర ఆమోద పత్రాలు అందజేశారు. ప్రతి కేటగిరీ ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులో వివిధ పథకాల కింద రుణ సేవలు పొందవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు.



    ఈ సందర్భంగా హైదరాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య, సైఫాబాద్ రీజినల్ హెడ్ శ్రీధర్ బాబు, సైఫాబాద్ డిప్యూటీ రీజినల్ హెడ్ ప్రకాష్ బాబు, ఖాజాగూడ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రవిబాబు, బ్యాంకు సిబ్బంది , 30 శాఖలకు చెందిన మేనేజర్లు, ఎంఎస్‌ఎంఈ ఖాతాదారులు తదితరులు ఉన్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bank, Union bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు