Interest Rates | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ (Bank) కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ ఉండనుంది. ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే నెలవారీ ఈఎంఐ పైకి కదులుతుంది. అలాగే కొత్త లోన్ పొందాలని భావిస్తే.. ఎక్కువ వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అన్ని టెన్యూర్లకు ఇది వర్తిస్తుంది. ఎంసీఎల్ఆర్ పెంపు నిర్ణయం డిసెంబర్ 11 నుంచి అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.5 శాతం నుంచి 8.6 శాతం వరకు ఉంది. ఈ కొత్త రుణ రేట్లు జనవరి 10 వరకు అలాగే కొనసాగుతాయి. అలాగే బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను కూడా సవరించింది. రెపో రేటుతో అనుసంధానమైన రేట్లను పెంచింది.
సిగరెట్లు తాగే వారికి బ్యాడ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త రూల్స్, వాటిపై నిషేధం?
రుణ రేట్ల పెంపు వల్ల బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. కాగా సిబిల్ స్కోర్ ప్రాతిపదికన హోమ్ లోన్ వడ్డీ రేట్లు మారతాయి. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ రుణ రేట్లు పడుతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించుకోవాలి.
మధ్యతరగతికి మోదీ కొత్త ఏడాది కానుక? కేంద్రం కీలక నిర్ణయం? జనవరి 1 నుంచి..
యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.6 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతంగా, ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.25 శాతంగా కొనసాగుతున్నాయి. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.05 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. ఇక నెల రోజుల ఎంసీఎల్ఆర్ 7.65 శాతంగా, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.5 శాతంగా ఉన్నాయి. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు 9.05 శాతంగా ఉంది.
ఇకపోతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ స్కోర్ 800 లేదా ఆపైన ఉన్న వారికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే రూ. 30 లక్షల వరకు హోమ్ లోన్ మొత్తానికి ఈ వడ్డీ రేటు పడుతుంది. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఇద్దరికీ ఇదే వడ్డీ రేటు ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే వడ్డీ రేటు కూడా పెరుగుతుందని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra bank, Banks, Home loans, Mclr, Union bank of india