ప్రముఖ ఫిన్‌టెక్ (Firech) సంస్థ యూని ఆర్బిట్ టెక్నాలజీస్ (Uniorbit Technologies- UNI) అనేక రకాల క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. సంస్థ తాజాగా తీసుకొచ్చిన ‘యూఎన్‌ఐ పే వన్ థర్డ్ (Uni Pay 1/3rd)' అనే ఓ క్రెడిట్ కార్డు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించకపోతే.. క్రెడిట్ కార్డు కంపెనీ ఆలస్య రుసుము, అధిక వడ్డీని వసూలు చేస్తుంది. అయితే 'పే వన్ థర్డ్' క్రెడిట్ కార్డు కస్టమర్లకు వారి నెలవారీ బిల్లును మూడు సమాన భాగాలుగా విభజించేందుకు అనుమతిస్తుంది. తద్వారా వచ్చే మూడు నెలల్లో ఒక్కో భాగాన్ని ఒక్కో నెల చొప్పున అదనపు వడ్డీ, ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు.
Innova Crysta: టయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ విడుదల... ధర రూ.17.18 లక్షల నుంచి
ఈ కార్డు అందిస్తున్న సదుపాయాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కార్డులో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందుకే ఈ కార్డు కోసం అప్లై చేసే ముందు కస్టమర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
* యూని పే వన్ థర్డ్ (UNI Pay 1/3rd) కార్డు ఎలా పని చేస్తుంది?
కార్డు యూజర్ల నెలవారీ క్రెడిట్ కార్డు బిల్లు రూ. 30,000 అనుకుంటే.. ఇతర క్రెడిట్ కార్డులాగే ఈ బిల్లును పూర్తిగా చెల్లించవచ్చు. లేదా మీరు క్రెడిట్ కార్డు అప్పును వాయిదా వేసుకోవచ్చు. అందుకు మీరు మీ బిల్లును మూడు సమాన భాగాలుగా విభజించి.. మొదటి, రెండో, మూడో నెలల్లో ఒక్కో నెల చొప్పున రూ. 10,000 చెల్లించవచ్చు. అయితే ఈ కార్డులో కూడా క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు వన్ థర్డ్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే.. తదుపరి నెల క్రెడిట్ లిమిట్ మీ బకాయిలకు సమానంగా తగ్గిపోతుంది. మీరు మీ నెలవారీ బిల్లులను క్లియర్ చేస్తే, మీ క్రెడిట్ లిమిట్ యధా స్థాయికి వస్తుంది.
Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. రూ.120 దిశగా పరుగులు..
ప్రస్తుతానికైతే కార్డు జాయినింగ్ ఫీజులు లేదా వార్షిక ఛార్జీలు లేవు. జనవరి 31, 2022 లోపు యూఎన్‌ఐ(UNI) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న కస్టమర్లకు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అందిస్తున్నారు. ఈ సమయం తర్వాత కొత్తగా కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్లకు అందుబాటులో ఉన్న యూఎన్‌ఐ యాప్ ద్వారా ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు కనిష్టంగా 25 ఏళ్లు గరిష్టంగా 60 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కస్టమర్లు ఒక వర్చువల్ కార్డు పొందొచ్చు. ఫిజికల్ కార్డ్ డెలివరీ కావడానికి కొంత సమయం పడుతుంది.
* ఉపయోగాలు
ఈ కార్డు ద్వారా బిల్లులను ఒకేసారి పూర్తిగా చెల్లిస్తే.. మీకు 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర క్రెడిట్ కార్డులలో చేసిన అప్పు/వ్యయం తిరిగి చెల్లించడానికి మీకు 30 నుంచి 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. పే వన్ థర్డ్ కార్డులో, పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 90 రోజుల క్రెడిట్ పీరియడ్ లభిస్తుంది.
* ఈ కార్డు ప్రతికూలతలు
క్రెడిట్ వ్యయాన్ని చెల్లించడానికి 90 రోజుల సమయం లభించినప్పటికీ.. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారం ఖర్చులు చేస్తే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మీరు బిల్లు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ కార్డు మూడు నెలల వరకు మీ క్రెడిట్ మొత్తానికి వడ్డీ వసూలు చేయదు. కానీ ఒకవేళ మీరు ఏదో ఒక నెలలో వాయిదా కట్టలేకపోతే ఆలస్య రుసుము మాత్రం ఛార్జ్ చేస్తుంది.
SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే
ఉదాహరణకి మీరు యూఎన్‌ఐ కార్డ్‌తో రూ. 40,000 చెల్లించాల్సి ఉందని అనుకుందాం. అయితే మీరు అది సకాలంలో చెల్లించకపోతే యూఎన్‌ఐ కార్డు ఆలస్య రుసుముగా రూ. 3,000 పెనాల్టీ విధిస్తుంది. అదే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే.. ఆలస్య రుసుముగా రూ.1,100 మాత్రమే విధిస్తుంది. అంతేకాకుండా, ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రధాన బకాయిలో కనీసం 7.5 శాతం చెల్లించాలి. లేనిపక్షంలో, తదుపరి బిల్లింగ్ లో నెలకు 5.5 శాతం వరకు క్యారీ ఫార్వర్డ్ ఫీజు వసూలు చేస్తుంది.
* ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
తక్కువ వేతన జీవులు సాధారణమైన క్రెడిట్ కార్డులు పొందలేరు. అలాంటి కస్టమర్లు ఈ కొత్త-క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయ్యొచ్చు. కానీ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా.. సకాలంలో బిల్లులు చెల్లించాల్సి ఉండగా గుర్తించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే బిల్లులు చెల్లించడానికి రెండు నెలల అదనపు సమయం దొరుకుతుంది కాబట్టి ఈ కార్డు తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking, Business, Credit cards, Mobile Banking