Home /News /business /

UNI CREATED A RECORD IN THE BANKING SECTOR VIRTUAL LOUNGE SYSTEM FOR CUSTOMER PUBLICITY LOOK AT THAT UMG GH

Union Bank of India: బ్యాంకింగ్ రంగంలో రికార్డు సృష్టించిన యూఎన్ఐ.. కస్టమర్ల పబ్లిసిటీ కోసం ఏం చేసిందంటే..?

బ్యాంకింగ్ రంగంలో  రికార్డు సృష్టించిన యూఎన్ఐ..  కస్టమర్ల పబ్లిసిటీ కోసం వర్చువల్ లాంజ్ సిస్టమ్..!

బ్యాంకింగ్ రంగంలో రికార్డు సృష్టించిన యూఎన్ఐ.. కస్టమర్ల పబ్లిసిటీ కోసం వర్చువల్ లాంజ్ సిస్టమ్..!

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UNI) మరో కొత్త రికార్డు సాధించింది. జులై 8న మెటావర్స్ ( Metaverse)బేస్డ్ వర్చువల్ లాంజ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా తమ ప్రొడక్ట్స్‌ను కస్టమర్లకు వర్చువల్‌గా ప్రదర్శించనున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UNI)మరో కొత్త రికార్డు సాధించింది. జులై 8న మెటావర్స్( Metaverse)బేస్డ్ వర్చువల్ లాంజ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా తమ ప్రొడక్ట్స్‌ను కస్టమర్లకు వర్చువల్‌గా ప్రదర్శించనున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. పబ్లిసిటీ కోసం వర్చువల్ షాప్‌ను ప్రారంభించిన మొదటి ఇండియన్ బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలుస్తోంది. ‘Uni-verse పేరుతో మెటావర్స్ వర్చువల్ లాంజ్‌ను ప్రారంభిస్తున్నాం. ప్రారంభ దశలో ఈ ప్లాట్‌ఫారమ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, వీడియోలను హోస్ట్ చేస్తుంది. కస్టమర్లు లాంజ్ చుట్టూ తిరుగుతూ బ్యాంక్ డిపాజిట్లు, లోన్‌లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర స్కీమ్స్ గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యూని-వర్స్ అనేది కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. టెక్ మహీంద్రా సహకారంతో ఈ సేవలను ప్రారంభిస్తున్నాం’ అని బ్యాంక్ తెలిపింది.

అయితే మెటావర్స్‌లో షాప్ ఓపెన్ చేసిన మొదటి రుణదాత యూనియన్ బ్యాంక్ కాదు. US-బేస్డ్ JP మోర్గాన్ చేజ్ & కో ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలో ఆ ఘనత సాధించింది. JP మోర్గాన్ తమ లాంజ్‌ను Decentraland అనే Metaverse ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభించింది. 2020లో లాంచ్ చేసిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బ్లాక్‌చెయిన్ వ్యాపారానికి Onyx లాంజ్ అనే పేరు పెట్టారు. Onyx లాంజ్‌కు వచ్చే విజిటర్స్ లింగం, స్కిన్ టోన్, హెయిర్‌స్టైల్, దుస్తులు, యాక్సెసరీస్ ఎంచుకోవడం ద్వారా వారి అవతార్స్‌ సృష్టించుకోవచ్చు. విజిటర్స్‌కు టైగర్ అవతార్, బ్యాంక్ CEO అయిన జామీ డిమోన్ డిజిటల్ పోర్ట్రెయిట్ స్వాగతం పలుకుతాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా మెటావర్స్ స్టోర్‌ను ప్రారంభించే యోచనలో ఉంది.

ఇదీ చదవండి:  Viral: అయ్యబాబోయ్.. చైనా వాళ్లు మళ్లీ భయపెట్టేస్తున్నారు..! ఈసారి కరోనా‌తో కాదు అదేదో కొత్త రకం ఐస్‌క్రీమ్‌తో.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?


మెటావర్స్ అంటే ఏంటి? ఇది ఎందుకు ముఖ్యమైనది?
మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ. ఇది ఇంటర్నెట్‌కు అభివృద్ధి చెందిన రూపంగా నిపుణులు చెబుతున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR)తో నిజ జీవిత అనుభవాలు, పరిస్థితులను అనుభూతి చెందగల టెక్నాలజీ ఇది. వినియోగదారులు మెటావర్స్‌ను ఉపయోగించి ప్రతి పని చేయగలరు. వర్చువల్‌గా వేర్వేరు షాప్స్ సందర్శించవచ్చు. వివిధ మెటావర్స్ వినియోగదారులతో కన్వర్జేషన్స్ చేయవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగం పెరగడంతో బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోలలో ఆన్‌లైన్ లోన్ షేర్ పెంచుకుంటున్నాయి. దేశీయ, విదేశీ రుణదాతలు మెటావర్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి ఆసక్తి చూపుతున్నాయి.

ప్రస్తుతానికి బ్యాంక్ తమ ప్రొడక్ట్స్‌ను మెటావర్స్ ద్వారా ప్రచారం చేస్తుందని, అయితే రెగ్యులేటరీ క్లారిటీ లేకపోవడం వల్ల వర్చువల్ లాంజ్ ద్వారా నేరుగా రుణాలను జారీ చేయడం లేదని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (DBU) ద్వారా మెటావర్స్ లాంజ్‌ను ప్రదర్శించాలని బ్యాంకు భావిస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 జిల్లాల్లో 75 డీబీయూలను ఏర్పాటు చేస్తున్నట్లు 2022-23 కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది.



DBU అనేది డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, సేవలను అందించడానికి నిర్దిష్ట డిజిటల్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండే స్పెషలైజ్డ్ ఫిక్స్‌డ్ పాయింట్ బిజినెస్ యూనిట్/హబ్. DBU లక్ష్యం డిజిటల్ ఫైనాన్షియల్ సేవల విస్తరణ, ఫైనాన్షియలయ్ ఇన్‌క్లూజన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. డిజిటల్ బ్యాంకింగ్ అనుభవం ఉన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ప్రతి సందర్భంలో అపెక్స్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోకుండానే టైర్ 1 నుంచి టైర్ 6 సెంటర్లలో DBUలను ఓపెన్ చేసుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Banks, Home loans, Metaverse, Union bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు