Insurance: ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు రూ.16,887 కోట్లు... అందులో మీదెంత?

Unclaimed Insurance Policy | ప్రీమియం రూపంలో చెల్లించింది మీరు కష్టపడి సంపాదించిన డబ్బే. కాబట్టి దర్జాగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇన్స్యూరెన్స్ కంపెనీలో మీ డబ్బు మీరు ఇప్పటి వరకు క్లెయిమ్ చేసుకోకపోతే ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు.

news18-telugu
Updated: July 2, 2019, 3:58 PM IST
Insurance: ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు రూ.16,887 కోట్లు... అందులో మీదెంత?
Insurance: ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు రూ.16,887 కోట్లు... అందులో మీదెంత? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 2, 2019, 3:58 PM IST
భారతదేశంలో ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న డబ్బు ఎంతో తెలుసా? రూ.16887.66 కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు వెల్లడించిన గణాంకాలివి. నాన్-లైఫ్ ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో క్లెయిమ్ కాని డబ్బు రూ.989.62 కోట్లు. ఇవి 2018 నాటి లెక్కలే. ఇన్స్యూరెన్స్ పాలసీ హోల్డర్లను గుర్తించి వారి డబ్బులు వారికి తిరిగి ఇవ్వాలని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI అనేక సందర్భాల్లో ఇన్స్యూరెన్స్ కంపెనీలను కోరింది. ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బును పాలసీ హోల్డర్లకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతీ ఇన్స్యూరెన్స్ కంపెనీలో డైరెక్టర్ లెవెల్ కమిటీకి అప్పగించింది. అయినా లాభం లేదు. ఇప్పటికీ ఆ డబ్బు ఇన్స్యూరెన్స్ కంపెనీల ఖజానాల్లో అలాగే ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌-LIC లేదా మరే ఇతర ఇన్స్యూరెన్స్ కంపెనీలో అయినా మీ డబ్బు క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి.

Unclaimed insurance, unclaimed insurance money india, Unclaimed insurance amount, unclaimed amount of policyholders, unclaimed insurance amount in india, lic unclaimed policy status link, unclaimed insurance policy, ఇన్స్యూరెన్స్ డబ్బు, క్లెయిమ్ కాని ఇన్స్యూరెన్స్ పాలసీ, ఇన్స్యూరెన్స్ పాలసీ క్లెయిమ్, పాలసీ క్లెయిమ్ ఎలా చేయాలి, అన్‌క్లెయిమ్డ్ ఇన్స్యూరెన్స్ పాలసీ, ఎల్ఐసీ, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(ప్రతీకాత్మక చిత్రం)

పాలసీలు ఎందుకు క్లెయిమ్ కావట్లేదు?



ఇన్స్యూరెన్స్ పాలసీలు క్లెయిమ్ కాకపోవడానికి ప్రధాన కారణం ఆ పాలసీ గురించి నామినీలకు తెలియకపోవడమే. చాలావరకు పాలసీ హోల్డర్లు పాలసీ తీసుకునే సమయంలో నామినీల పేర్లు వెల్లడిస్తారు కానీ... పాలసీ తీసుకున్న విషయం నామినీలకు చెప్పరు. పాలసీ హోల్డర్ చనిపోతే ఆ పాలసీ మరుగునపడిపోతుంది. పాలసీ గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియదు. దీంతో పాలసీ క్లెయిమ్ కాకుండా ఉండిపోతుంది. అందుకే ఎవరు ఏ పాలసీ తీసుకున్నా ముందుగా ఆ విషయాన్ని నామినీకి తెలపడం తప్పనిసరి. అంతేకాదు... పాలసీ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచాలి. ఇక పాలసీ క్లెయిమ్‌ను చెక్ రూపంలో తీసుకొని, చెక్‌ను గడువులోగా బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం మరో కారణం. అందుకే ఇటీవల ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ ద్వారా క్లెయిమ్ సెటిల్ చేస్తున్నాయి. 2014 తర్వాత తీసుకున్న పాలసీలన్నింటికీ ఇదే వర్తిస్తుంది.

క్లెయిమ్ కాని డబ్బు ఏమవుతుంది?




క్లెయిమ్ కాని పాలసీ డబ్బుల విషయంలో IRDAI ఇన్స్యూరెన్స్ కంపెనీలకు సూచనలు జారీ చేసింది. 2017 సెప్టెంబర్ 30 నాటికి 10 ఏళ్ల పాటు ఎవరూ క్లెయిమ్ చేసుకోని ఇన్స్యూరెన్స్ పాలసీల డబ్బును సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలని సూచించింది. 2018 మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

Unclaimed insurance, unclaimed insurance money india, Unclaimed insurance amount, unclaimed amount of policyholders, unclaimed insurance amount in india, lic unclaimed policy status link, unclaimed insurance policy, ఇన్స్యూరెన్స్ డబ్బు, క్లెయిమ్ కాని ఇన్స్యూరెన్స్ పాలసీ, ఇన్స్యూరెన్స్ పాలసీ క్లెయిమ్, పాలసీ క్లెయిమ్ ఎలా చేయాలి, అన్‌క్లెయిమ్డ్ ఇన్స్యూరెన్స్ పాలసీ, ఎల్ఐసీ, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(ప్రతీకాత్మక చిత్రం)

పాత పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?


ప్రీమియం రూపంలో చెల్లించింది మీరు కష్టపడి సంపాదించిన డబ్బే. కాబట్టి దర్జాగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇన్స్యూరెన్స్ కంపెనీలో మీ డబ్బు మీరు ఇప్పటి వరకు క్లెయిమ్ చేసుకోకపోతే ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం పాలసీ నెంబర్, పాలసీ హోల్డర్ పాన్ కార్డ్, ఆధార్ వివరాలు ఉండాలి. క్లెయిమ్ కాని పాలసీల వివరాలను విధిగా తమ వెబ్‌సైట్లల్లో అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత ఇన్స్యూరెన్స్ కంపెనీలదే. అంతేకాదు... ప్రతీ 6 నెలలకోసారి వివరాలను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు చాలాకాలం క్రితం ఎల్ఐసీ పాలసీ తీసుకొని, పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా క్లెయిమ్ చేసుకోకపోతే ఇప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌‌లో క్లెయిమ్ కాని పాలసీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసి ఎల్ఐసీ పాలసీ నెంబర్, పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే క్లెయిమ్ కాని పాలసీకి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. ప్రతీ ఆరు నెలలకు ఓసారి వివరాలు అప్‌డేట్ అవుతాయి.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేస్తే లాభమిదే...

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ఈ 5 ఫీచర్లు తెలుసుకోండి

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా
First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...