LIC Paid-up: ఎల్ఐసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా? పెయిడ్-అప్‌గా మార్చుకుంటే లాభాలివే

LIC Paid-up Policy | పాలసీ సరెండర్ చేయడం కన్నా పెయిడ్-అప్‌గా మార్చుకోవడమే మంచిదని చెబుతుంటారు ఫైనాన్షియల్ ప్లానర్స్. మరి పెయిడ్-అప్‌ అంటే ఏంటీ? ఎలా మార్చుకోవాలి? లాభనష్టాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 15, 2019, 11:07 AM IST
LIC Paid-up: ఎల్ఐసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా? పెయిడ్-అప్‌గా మార్చుకుంటే లాభాలివే
LIC Paid-up: ఎల్ఐసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా? పెయిడ్-అప్‌గా మార్చుకుంటే లాభాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 15, 2019, 11:07 AM IST
ఎల్ఐసీ... గ్రామగ్రామానికి విస్తరించిన భారత ప్రభుత్వరంగ బీమా సంస్థ. భారతదేశంలో దాదాపు ప్రతీ కుటుంబంలో ఒకరికి ఎల్ఐసీ పాలసీ ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే డబ్బు పొదుపు చేద్దామనో, జీవితానికి బీమా ఉండాలనో, మొహమాటంతోనో మొదట ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రీమియంలు చెల్లించని వాళ్లు చాలామందే ఉంటారు. అయితే పాలసీ ఆపేసిన తర్వాత ఇక వారికి బీమా వర్తించదు. ఒకవేళ పాలసీ సరెండర్ చేసినా అప్పటివరకు చెల్లించిన ప్రీమియంలు రాకపోవచ్చు. పాలసీ సరెండర్ చేస్తే కలిగే లాభనష్టాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. పాలసీ సరెండర్ చేయడం కన్నా పెయిడ్-అప్‌గా మార్చుకోవడమే మంచిదని చెబుతుంటారు ఫైనాన్షియల్ ప్లానర్స్. మరి పెయిడ్-అప్‌ అంటే ఏంటీ? ఎలా మార్చుకోవాలి? లాభనష్టాలేంటో తెలుసుకోండి.

LIC Paid-up: ఎల్ఐసీ పెయిడ్-అప్‌ వివరాలివే


పాలసీ సరెండర్ చేయడం అంటే పూర్తిగా రద్దు చేయడమే. చెల్లించిన ప్రీమియంల కన్నా తక్కువే వెనక్కి వస్తుంది. పాలసీ ఆపెయ్యడానికి ఇది ఒక పద్ధతి. అలా కాకుండా ప్రీమియంలు చెల్లించకుండా పాలసీని కొనసాగించాలనుకుంటే పెయిడ్-అప్‌గా మార్చుకోవడమే మార్గం. పాలసీ సరెండర్ చేస్తే బీమా రద్దవుతుంది. అదే పాలసీని పెయిడప్‌గా మార్చుకుంటే బీమా రక్షణ ఉంటుంది. అయితే మొదట ఎంత మొత్తానికి బీమా తీసుకున్నారో అంత వర్తించదు. బీమా తగ్గుతుంది. అది మీరు చెల్లించిన ప్రీమియంలపై ఆధారపడి ఉంటుంది. ఈ కింది ఫార్ములా ఆధారంగా పెయిడ్ అప్ వ్యాల్యూను నిర్ణయిస్తారు.

చెల్లించిన ప్రీమియంలు / చెల్లించాల్సిన ప్రీమియంలు x బీమా మొత్తం= పెయిడ్ అప్ వ్యాల్యూ

ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.10 లక్షలకు బీమా తీసుకున్నారనుకుందాం. పాలసీ గడువు 25 ఏళ్లు. 5 ఏళ్లు ప్రీమియం చెల్లించిన ఆ తర్వాత ఆపేశారు. ఆ పాలసీని పెయిడ్ అప్‌గా మార్చుకుంటే బీమా రూ.2 లక్షలకు వర్తిస్తుంది. అంటే రూ.10 లక్షలకు బదులు రూ.2 లక్షల బీమా ఉంటుంది. అంటే ప్రీమియం చెల్లించడం ఆపేసిన తర్వాత కూడా బీమా పొందొచ్చు. అదే పాలసీ సరెండర్ చేస్తే మాత్రం నష్టపోవాల్సిందే. అయితే ఒక ఏడాదో, రెండేళ్లో ప్రీమియం చెల్లించి పెయిడప్‌గా మార్చుకుంటామంటే కుదరదు. కనీసం మూడేళ్లు రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లించినవారికే పెయిడప్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది.



Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్

Loading...
ఇవి కూడా చదవండి:

LIC Policy: ఎల్ఐసీ పాలసీ సగంలో ఆపేశారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

LIC Jeevan Amar: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... లాభాలు ఇవే

LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...