ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టి సారిస్తున్నాయి. కార్లు, స్కూటర్లతో పాటు ఇప్పుడు ప్రీమియం బైక్‌లను కూడా లాంచ్ చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ కంపెనీ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ ఇండియన్ మార్కెట్లోకి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేసింది. F77, రీకాన్, ఎఫ్ 77 లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్ పేర్లతో వీటిని ఇంట్రడ్యూస్ చేసింది. ఇవి ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూడు బైక్‌ల డిజైన్, ఫీచర్లలో తేడా ఉన్నప్పటికీ.. వీటి పనితీరు మాత్రం ఒకేలా ఉంటుంది. అయితే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు కేవలం 77 యూనిట్లు మాత్రమే మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఇవి విడుదలైన కేవలం 2 గంటల్లోనే సేల్ అయిపోవడం గమనార్హం.
ఎఫ్77 ఒరిజినల్ వేరియంట్ రూ.3.80 లక్షలు (ఎక్స్ షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 27-kW ఎలక్ట్రిక్ మోటార్, IP67-రేటెడ్ 7.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బైక్ 36 bhp వద్ద గరిష్ట శక్తిని, 85Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 206 కి.మీలు ప్రయాణించవచ్చు. అల్ట్రావయోలెట్ ఎఫ్77 బైక్ 140 kmph గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. ఇది కేవలం 8.3 సెకన్లలో 0- నుంచి 100kmph వేగాన్ని చేరుకోగలదు. ఇది ఒరిజినల్ ట్రిమ్ క్రాష్ గార్డ్స్, స్టాండర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ వేరియంట్ బ్లాక్, సిల్వర్, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్
F77 రీకాన్ రూ.4.55 లక్షల(ఎక్స్ షోరూమ్)కి లభిస్తుంది. ఈ బైక్ సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 307 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే ఇది మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ బైక్‌కు 10.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ 39 bhp వద్ద గరిష్ట శక్తిని, 95Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకోగలదు.
Royal Enfield: నెలకు రూ.3,500... ఈ బుల్లెట్ బైక్ మీదే
F77 స్పెషల్ ఎడిషన్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ బైక్‌గా నిలిచింది. ఈ వేరియంట్లో కేవలం 77 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆన్లైన్ బుకింగ్‌లు ప్రారంభించిన రెండు గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. బైక్ బ్యాటరీ ప్యాక్‌ను పరిశీలిస్తే.. ఇది 40 bhp గరిష్ట శక్తి, 100Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన మోటారుతో వస్తుంది. డిజైన్ పరంగా టాప్ స్పీడ్ రీకాన్ వేరియంట్ మాదిరిగానే ఉన్నప్పటికీ, కేవలం 7.8 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకోగలదు. దీని వెనుక టైర్ కవర్, లివర్ గార్డ్స్ వంటి యాక్సెసరీస్ వస్తాయి. ఈ బైక్ రూ.5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Electric bike, Electric Vehicle