Gold: ప్రపంచంలో బంగారం ఎక్కువగా ఎవరి దగ్గర ఉందో తెలుసా?

Gold Investment | ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారానికి కేటాయించిన లెక్కలు చూస్తే గ్లోబల్ యావరేజ్ 2%, ఆసియా యావరేజ్ 3% ఉంది. భారతీయ సంపన్నుల ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా 4% ఉండటం విశేషం.

news18-telugu
Updated: May 9, 2019, 12:35 PM IST
Gold: ప్రపంచంలో బంగారం ఎక్కువగా ఎవరి దగ్గర ఉందో తెలుసా?
పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్లు మందగించడంతో ఈ ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
  • Share this:
ప్రపంచంలో బంగారం ఎక్కువగా ఎవరి దగ్గర ఉందో తెలుసా? భారతీయ సంపన్నుల దగ్గరే. భారతదేశంలోని అల్ట్రా-హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(UHNWIs) ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాలు ఎక్కువగా ఉన్నాయని తాజా లెక్కలు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్లో అస్థిరత కారణంగా సంపన్నులు ఎక్కువగా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారని అంచనా. వారిలో 14 శాతం మంది 2019లో బంగారంపై పెట్టుబడులు పెంచబోతున్నారని నైట్ ఫ్రాంక్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. గతేడాదితో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారానికి కేటాయించిన లెక్కలు చూస్తే గ్లోబల్ యావరేజ్ 2%, ఆసియా యావరేజ్ 3% ఉంది. భారతీయ సంపన్నుల ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా 4% ఉండటం విశేషం.

Read this: Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారో తెలుసా?

బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుంటారు ఇన్వెస్టర్లు. ఇతర పెట్టుబడుల్లో ఉన్నట్టుగానే బంగారం ధరల విషయంలోనూ అస్థిరత ఉంటుంది కానీ, దీర్ఘకాలంలో చూస్తే బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇక భారతదేశంలో బంగారానికి, సంస్కృతీ సంప్రదాయాలకు విడదీయరాని బంధం ఉంది. అందుకే భారతదేశంలో బంగారం వినియోగదారులు ఎక్కువగా ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అవసరమైతేనే ఫిజికల్ గోల్డ్ కొంటున్నారు తప్ప, పెట్టుబడి కోసమైతే గోల్డ్ బాండ్స్ వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిAlcohol Study: వామ్మో... మనవాళ్లు ఫుల్లుగా తాగేస్తున్నారుగా... షాకిస్తున్న రిపోర్ట్

LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు
First published: May 9, 2019, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading