UK Bans Facebook : యూకేలో బ్యాన్ దిశగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ...? ఎందుకో తెలుసా...?

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో ఉగ్రవాదం, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా చెలామణి అవుతున్న కారణంగా... యూకేలో బ్యాన్ దిశగా అడుగులు పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: April 9, 2019, 5:51 PM IST
UK Bans Facebook : యూకేలో బ్యాన్ దిశగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ...? ఎందుకో తెలుసా...?
ఫేస్ బుక్
news18-telugu
Updated: April 9, 2019, 5:51 PM IST
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లకు యూకేలో చుక్కెదురైంది. ఈ రెండు సోషల్ ప్లాట్ ఫామ్స్ పై ఉగ్రవాదం, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా చెలామణి అవుతున్న కారణంగా బ్యాన్ దిశగా అడుగులు పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల యూకే పార్లమెంట్ రూపొందించిన కొత్త చట్టం ప్రకారం ఈ నిర్ణయం వెలువనున్నట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉగ్రవాదం, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కంపెనీ డైరక్టర్లను ఆదేశిస్తూ యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కంటెంట్ విచారణ, వాటిపై విధించే జరిమానాపై మొత్తం 12 వారాల గడువు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఫేక్ న్యూస్, ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై సైతం యూకే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

ఇటీవల న్యూజిలాండ్ లోని ఒక ప్రార్థనాస్థలంలో జరిగిన కాల్పుల పూర్తి నిడివి గల వీడియోను యూకేకు చెందిన 14 సంవత్సరాల మోలీ రస్సెల్ అప్‌లోడ్ చేశాడు. దీనిపై యూకే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అంతే కాదు గతంలో ఒక విద్యార్థి ఫేస్‌బుక్‌లోని వీడియోను చూసి ఆత్మహత్య సైతం చేసుకున్నాడని గుర్తించింది. ఇదిలాఉంటే టెక్ కంపెనీలు యూజర్ల హక్కులను కాపాడుతున్నామనే పేరిట ఇలాంటి షాకింగ్ కంటెంట్‌ను పబ్లిక్‌గా ఉంచడం తగదని యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జవీద్ పేర్కొన్నారు. అయితే యూకే ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకుంటామని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...