హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... కొత్త సర్వీస్ ప్రారంభం

Aadhaar Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... కొత్త సర్వీస్ ప్రారంభం

Aadhaar Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... కొత్త సర్వీస్ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... కొత్త సర్వీస్ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

UIDAI Ask Aadhaar | ఆధార్ అప్‌డేట్ సమాచారం, ఆధార్ స్టేటస్, డౌన్‌లోడ్ ఇ ఆధార్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఇలా ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. ఆధార్‌కు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది.

ఆధార్ కార్డు ఉన్నవారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. 'ఆస్క్ ఆధార్' పేరుతో సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆస్క్ ఆధార్ అంటే ఆధార్‌ను అడగండి అని అర్థం. ఇది యూఐడీఏఐ ఛాట్‌బాట్ సర్వీస్. అంటే మీకు ఆధార్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏవైనా ఉంటే ఛాట్‌బాట్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీ సమస్యల్ని ఛాటింగ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేస్తే ఛాట్‌బాట్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి మీ సమస్య వివరించొచ్చు. ఆధార్ అప్‌డేట్ సమాచారం, ఆధార్ స్టేటస్, డౌన్‌లోడ్ ఇ ఆధార్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఇలా ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. ఆధార్‌కు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది. ఆధార్‌కు సంబంధించిన వీడియోలు, సంబంధిత టాపిక్స్ కూడా అదే విండోలో చూడొచ్చు.

ఇక ఆధార్‌కు సంబంధించి యూఐడీఏఐ మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 125 కోట్ల మంది ఆధార్ కార్డు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది యూఐడీఏఐ. ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు కార్డుగా ఉపయోగించడం పెరిగిపోయినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆధార్ సర్వీస్ ప్రారంభించినాటి నుంచి 37,000 కోట్ల సార్లు ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరిగినట్టు లెక్కలున్నాయి. అంతేకాదు... ప్రతీరోజు ఆధార్ ఆథెంటికేషన్ కోసం మూడు కోట్ల రిక్వెస్ట్‌లు యూఐడీఏఐకు వస్తున్నాయి. ఇప్పటి వరకు 331 కోట్ల ఆధార్ అప్‌డేట్స్ జరిగాయి. ప్రతీ రోజు 3 నుంచి 4 లక్షల వరకు ఆధార్ అప్‌డేట్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి.

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

2020 Bank Holidays: బ్యాంకులకు వచ్చే ఏడాది సెలవులు ఎప్పుడో తెలుసుకోండి

Alert: చెక్ పైన డేట్ రాస్తున్నారా? 2020 లో జాగ్రత్త... ఎందుకో తెలుసా?

SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి

First published:

Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, Personal Finance, UIDAI

ఉత్తమ కథలు