హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

Aadhaar Update | ఆధార్ కార్డుదారలకు అలర్ట్. యూఐడీఏఐ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. ఆధార్ అథంటికేషన్ విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Aadhaar News | ఆధార్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా, బ్యాంక్ (Bank) అకౌంట్ ఓపెనింగ్ దగ్గరి నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ (Tax) ఫైలింగ్ దాకా చాలా వాటిని ఆధార్ కార్డు అవసరం అవుతుంది. అందుకే ఆధార్ కార్డు చాలా విలువైంది. ఇంకా ఆధార్ వివరాలతో జాగ్రత్తగా ఉండాలి. అవసరం అయితే తప్ప ఇతరులకు ఆధార్ వివరాలు అందించకపోవడం ఉత్తమం.

ఆధార్ జారీ సంస్థ యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. అధార్ అథంటికేషన్ చేసే ముందు కచ్చితంగా ఆధార్ కార్డుదారుడి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది. కంపెనీలు ఆధార్ అథంటికేషన్ చేయడానికి ముందు సంబంధిత వ్యక్తి నుంచి పేపర్ ద్వారా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ రూపంలో కానీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

పాత క్రెడిట్ కార్డు నచ్చడం లేదా? ఒక్క రూపాయి కట్టకుండా క్షణాల్లో ఉచితంగా కొత్త కార్డ్ పొందండి!

యూఐడీఏఐ ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధార్ ఆన్‌లైన్ అథంటికేషన్స్ చేసే రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ కచ్చితంగా సదురు కస్టమర్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని, అలాగే ఏ ఏ డేటాను తీసుకుంటున్నది తెలియజేయాలని యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఎందుకని ఏ పని కోసం ఆధార్ అథంటికేషన్ చేస్తున్నారో కూడా తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా అథంటికేషన్ ట్రాన్సాక్షన్లు కొంత కాలమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

మీ పాప పేరుపై ఈ అకౌంట్ తెరిస్తే రూ.63 లక్షలు.. ఎలానో తెలుసుకోండి!

సాధారణంగా రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ ఆధార్ వివరాలను ఫిజికల్ రూపంలో లేదంటే ఎలక్ట్రానిక్ రూపంలో స్టోర్ చేయవు. కచ్చితంగా ఆధార్ వివరాలకు మాస్కింగ్ ఉంటుంది. తొలి 8 నెంబర్లు కనిపించకుండా చూస్తారు. ఇలా చేయడం వల్ల డేటా ప్రైవసీకి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా అనుమతి లేనిదే రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ ఆధార్ వివరాలను స్టోర్ చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది.

రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ అనేవి ప్రజలకు ఆధార్ అథంటికేషన్ సర్వీసులు అందిస్తూ ఉంటాయి. ఇవి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రెపొసిటరీకి ఆధార్ నెంబర్ , బయోమెట్రిక్ ఓటీపీ, డెమోగ్రఫిక్ వివరాలను అందిస్తూ ఉంటాయి. అథంటికేషన్ కోసం ఇలా చేస్తాయి. అలాగే ఏమైనా మోసపూరిత చర్యలు కనిపిస్తే.. ఆ విషయాన్ని వెంటనే తమకు తెలియజేయాలని యూఐడీఏఐ రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్‌కు తెలియజేసింది. కాగా యూఐడీఏఐ గత నెలలో కొత్త ఫెసిలిటీ తెచ్చింది. ఆధార్ ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్ రూల్స్‌ను సరళీకరించింది. కుటుంబ పెద్ద అనుమతితో అడ్రస్ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీని వల్ల ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం సులభతరం కానుంది.

First published:

Tags: Aadhaar Card, Banks, My aadhaar, UIDAI

ఉత్తమ కథలు