Aadhaar News | ఆధార్ కార్డు కలిగిన వారికి తీపికబురు. యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదని తెలిపింది. అంటే ఆధార్ (Aadhaar) కార్డు కలిగిన వారు ఉచితంగానే వివరాలను అప్‌డేట్ (Aadhaar Update) చేసుకోవచ్చు. అయితే ఈ ఫెసిలిటీ కేవలం ఆన్‌లైన్ అప్‌డేట్‌కు మాత్రమే వర్తిస్తుంది. అదే మీరు దగ్గరిలోని ఆధార్ సెంటర్‌కు వెలితే మాత్రం కార్డులో వివరాలు మార్చుకోవడానికి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
యూఐడీఏఐ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉచితంగా ఆధార్ కార్డు వివరాలను మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఇది పరిమిత కాలం వరకే ఉంటుంది. జూన్ 14 వరకే మీరు ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోగలరు. ఈ డేట్ దాటితే.. మళ్లీ యథావిథిగానే చార్జీల వసూలు ఉంటుందని గుర్తించుకోవాలి.
రూ.1,200 పెట్టి గ్యాస్ సిలిండర్ కొనక్కర్లేదు.. ఈ స్టవ్‌తో రూ.1 ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు!
పదేళ్ల నుంచి ఆధార్ కార్డులో వివరాలు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోని వారు ఉంటే.. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే వీటికి డాక్యుమెంట్ ప్రూఫ్ కచ్చితంగా కావాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకపోతే మాత్రం మీరు ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కష్టమనే చెప్పుకోవాలి.
వాహనదారులకు హెచ్చరిక.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే రూ.25 వేల జరిమానా!
ఆన్‌లైన్‌లో వద్దనుకుంటే మీరు దగ్గరిలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి రూ. 50 చార్జీ చెల్లించుకోవాలి. పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే మాత్రం కచ్చితంగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. అలాగే బయోమెట్రిక్ అప్‌డేషన్ కోసం కూడా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
కాగా ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మైఆధార్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అక్కడ మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ సాయంతో లాగిన్ అవ్వాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. లాగిన్ అవుతారు. ఇప్పుడు ఆధార్ వివరాల అప్‌డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోవాలి. ఇందులో పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి. మీరు ఏ వివరాలు మార్చుకోవాలని భావిస్తున్నారో ఎంపిక చేసుకోవాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఇలా మీరు సులభంగా ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, My aadhaar, UIDAI