ఆధార్ కార్డు హోల్డర్లకు మరో సర్వీస్ ప్రారంభించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసీని అందిస్తోంది. ఈ డాక్యుమెంట్‌ను ఆధార్ కార్డు హోల్డర్లు ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు హోల్డర్లు UIDAI లింక్‌లో లాగిన్ చేయాల్సి ఉంటుంది. https://resident.uidai.gov.in/offline-kyc వెబ్‌సైట్‌లో ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ పొందొచ్చని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది UIDAI. అయితే ఇందుకోసం ఆధార్‌తో మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లేకపోతే ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ పొందడం సాధ్యం కాదు. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ చేయనట్టైతే ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీ ఆధార్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయినట్టైతే ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ పొందొచ్చు. ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ డౌన్‌లోడ్ జిప్ ఫైల్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే ముందే మీరు క్రియేట్ చేసిన 4 అంకెల కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో ఆధార్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ డౌన్లోడ్ చేయొచ్చు. మరి ఈ ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి.
PAN Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందా? ఇలా తెలుసుకోండి
Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారా? ఇలా కంప్లైంట్ చేయండి
#UpdateMobileInAadhaar
Aadhaar Paperless Offline e-KYC document is very helpful in offline verification of identification. If your mobile number is added to Aadhaar, you can obtain your Aadhaar Paperless Offline e-KYC from this link https://t.co/QkGHah3wTL #AddMobileToAadhaar pic.twitter.com/RXJ9m4wWDB
— Aadhaar (@UIDAI) June 1, 2021
ముందుగా ఆధార్ కార్డు హోల్డర్లు https://resident.uidai.gov.in/offline-kyc వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ తర్వాత 4 అంకెల కోడ్ క్రియేట్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
ఆ తర్వాత డౌన్‌లోడ్ పైన క్లిక్ చేస్తే జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, UIDAI