Home /News /business /

UIDAI LAUNCHES BHUVAN AADHAAR PORTAL TO LOCATE NEARBY AADHAAR CENTERS KNOW HOW IT WORKS SS

Aadhaar Update: ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... ఇస్రో సాయంతో భువన్ ఆధార్ పోర్టల్ ప్రారంభం

Aadhaar Update: ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... ఇస్రో సాయంతో భువన్ ఆధార్ పోర్టల్ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Update: ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... ఇస్రో సాయంతో భువన్ ఆధార్ పోర్టల్ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Update | ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయాలనుకునేవారికి, ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలు మార్చుకోవాలనుకునేవారికి అలర్ట్. యూఐడీఏఐ భువన్ ఆధార్ పోర్టల్ (Bhuvan Aadhaar Portal) ప్రారంభించింది.

ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కలిసి ఆధార్ కార్డ్ హోల్డర్ల కోసం భువన్ ఆధార్ పోర్టల్‌ని (Bhuvan Aadhaar Portal) ప్రారంభించాయి. ఈ పోర్టల్ సాయంతో మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్‌ను సులువుగా లొకేట్ చేయొచ్చు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఈ పోర్టల్‌ను రూపొందించడం విశేషం. ఆధార్ కార్డ్ (Aadhaar Card) హోల్డర్లు భారతదేశంలోని అన్ని ఆధార్ సెంటర్ల వివరాలను, లొకేషన్‌ను ఈ పోర్టల్‌లో ఈజీగా తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ హోల్డర్లు కొన్ని సేవల కోసం ఆధార్ సెంటర్‌కు, ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉన్నా, కేవలం ఆధార్ సెంటర్ లొకేషన్ వివరాలు అందించేందుకు యూఐడీఏఐ ఇస్రోతో కలిసి భువన్ ఆధార్ పోర్టల్‌ని రూపొందించడం విశేషం. ఈ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డ్ హోల్డర్లు తమకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్ లొకేషన్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Aadhaar Card: ఆరు లక్షల డూప్లికేట్ ఆధార్ కార్డుల రద్దు... ప్రకటించిన ప్రభుత్వం


ఆధార్ కార్డ్ హోల్డర్లు ముందుగా భువన్ ఆధార్ పోర్టల్ https://bhuvan.nrsc.gov.in/aadhaar/ ఓపెన్ చేయాలి.
Centers Nearby, Search by Aadhaar Seva Kendra, Search by PIN Code, State-wise Aadhaar Seva Kendra ఆప్షన్స్ ఉంటాయి.
Centers Nearby క్లిక్ చేసి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో చూడాలో ఆ వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
Search by Aadhaar Seva Kendra క్లిక్ చేసి ఆధార్ సేవా కేంద్రం పేరు టైప్ చేసి సెర్చ్ చేయాలి.
Search by PIN Code క్లిక్ చేసి మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
State-wise Aadhaar Seva Kendra క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

ఇలా వేర్వేరు పద్ధతుల్లో మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్, ఆధార్ సేవా కేంద్రాల అడ్రస్, మ్యాప్‌లో లొకేషన్ తెలుసుకోవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆధార్ సెంటర్ల వివరాలు ఈ పోర్టల్‌లో ఉంటాయి.

SBI WhatsApp Banking: ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేసుకోండి ఇలా



భువన్ పోర్టల్ విషయానికి వస్తే ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) రూపొందించిన పోర్టల్ ఇది. ఇందులో ఇస్రో సేకరించిన శాటిలైట్ డేటా ఉంటుంది. వరదలు, నీటి వనరలు, భూమి వివరాలు తెలుసుకోవచ్చు. భారత ప్రభుత్వానికి కావాల్సిన డేటాను ఈ పోర్టల్ అందిస్తుంది. ఇప్పుడు ఈ పోర్టల్‌లో ఆధార్ సెంటర్లను లొకేట్ చేయడానికి ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయడం విశేషం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, AADHAR, UIDAI

తదుపరి వార్తలు