హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar: ఆధార్-లింక్డ్ పేమెంట్ సిస్టమ్స్‌కు కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇక, కేటుగాళ్ల పప్పులు ఉడకవు!

Aadhaar: ఆధార్-లింక్డ్ పేమెంట్ సిస్టమ్స్‌కు కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇక, కేటుగాళ్ల పప్పులు ఉడకవు!

Aadhaar: ఆధార్-లింక్డ్ పేమెంట్ సిస్టమ్స్‌కు కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇక, కేటుగాళ్ల పప్పులు ఉడకవు!

Aadhaar: ఆధార్-లింక్డ్ పేమెంట్ సిస్టమ్స్‌కు కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇక, కేటుగాళ్ల పప్పులు ఉడకవు!

Aadhaar: పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్‌ల ద్వారా జరుగుతున్న అక్రమ ట్రాన్సాక్షన్లను అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). ఇందుకోసం ఒక కొత్త ఫీచర్‌ను సంస్థ తీసుకొస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్‌ల ద్వారా జరుగుతున్న అక్రమ ట్రాన్సాక్షన్లను అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). ఇందుకోసం ఒక కొత్త ఫీచర్‌ (New Feature)ను సంస్థ తీసుకొస్తోంది. ఫేక్‌ ఫింగర్‌ప్రింట్స్‌ ద్వారా జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేలా ఈ ఫీచర్ పని చేయనుంది. దీని ద్వారా వ్యక్తుల ఫింగర్‌ప్రింట్స్‌ సజీవంగా ఉన్న వ్యక్తివా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త అప్‌డేట్‌ వివరాలు తెలుసుకుందాం.

* ఫింగర్‌ప్రింట్‌ ‘లైవ్‌లీనెస్‌’ సెక్యూరిటీ ఫీచర్‌

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AEPS)కి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) తాజాగా కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను యాడ్ చేస్తోంది. ఫింగర్‌ప్రింట్ 'లైవ్‌లీనెస్' అనే ఈ సరికొత్త సెక్యూరిటీ ఫీచర్.. AEPS ద్వారా నకిలీ ఫింగర్‌ ప్రింట్స్‌ ఉపయోగించి డబ్బు విత్‌డ్రా చేయకుండా రక్షిస్తుంది. ఈ కొత్త ఫీచర్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ద్వారా AEPS పాయింట్ ఆఫ్ సేల్ (PoS) మెషీన్‌లకు అందుతుంది.

సంబంధిత అధికారులు ఎకనామిక్ టైమ్స్‌కు తెలిపిన వివరాల ప్రకారం, PoS ఇప్పుడు ఉపయోగించిన ఫింగర్‌ ప్రింట్‌ సజీవంగా ఉన్న వ్యక్తికి చెందినదా లేదా అనే విషయాన్ని గుర్తించగలదు. ఇలా మోసం జరిగిన సందర్భాలు చాలా తక్కువగా సుమారు 0.005 శాతం చోటు చేసుకున్నాయని అధికారి వివరించారు. AEPS ఇప్పటివరకు 1,507 కోట్లకు పైగా లాస్ట్‌-మైల్ బ్యాంకింగ్ లావాదేవీలను ప్రాసెస్ చేయగా, సిస్టమ్‌లో దాదాపు 7.54 లక్షల మోసపూరిత లావాదేవీలు జరిగాయని చెప్పారు.

ఇది కూడా చదవండి : అక్టోబర్ 1 నుంచి వీరికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించదు

* 6 మిలియన్లకు పైగా PoS మెషీన్లు

దేశవ్యాప్తంగా AEPS దుర్వినియోగం గురించి ఫిర్యాదులు వచ్చిన క్రమంలో కొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో కొంతమంది సిలికాన్ ప్యాడ్‌లపై క్లోన్ చేసిన ఫింగర్‌ప్రింట్‌లను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలు నిర్వహించారు. ఈ ఫింగర్‌ ప్రింట్స్‌ను భూ లావాదేవీల రికార్డుల కోసం అప్‌లోడ్‌ చేసిన వాటి నుంచి కాపీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం దేశంలో దాదాపు 5 మిలియన్ల AEPS PoS మెషీన్‌లు ఉన్నాయి. వాటిలో నెలకు 3.5 మిలియన్లు చురుకుగా పనిచేస్తున్నాయి.

* NPCI మార్గదర్శకాలు

మోసాలను అరికట్టాలనే ఉద్దేశంతో గత సెప్టెంబర్‌లో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకు(NBFCs) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాదారుడు మోసానికి సంబంధించి ఫిర్యాదును నమోదు చేసిన ఐదు రోజుల్లోగా దీనిపై అప్‌డేట్ ఇవ్వాలని ఈ గైడ్‌లైన్స్‌లో ఉంది. వీటిపై దర్యాప్తు నివేదికను సమర్పించాలని NPCI బ్యాంకులను కోరింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Aadhaar Card, New feature, Payments, UIDAI

ఉత్తమ కథలు