UIDAI GIVES BLUE COLORED AADHAAR CARD KNOW HOW TO APPLY FOR BAAL AADHAAR CARD SS GH
Blue Color Aadhaar: నీలం రంగులో ఆధార్ కార్డ్... ఎవరికి ఇస్తారు? ఎలా పొందాలి?
Blue Color Aadhaar: నీలం రంగులో ఆధార్ కార్డ్... ఎవరికి ఇస్తారు? ఎలా పొందాలి?
(ప్రతీకాత్మక చిత్రం)
Blue Color Aadhaar | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నీలం రంగులో ఆధార్ కార్డుల్ని ఇస్తుంది. ఈ ఆధార్ కార్డుల్ని (Aadhaar Card) ఎవరికి ఇస్తుందో, ఎలా పొందాలో తెలుసుకోండి.
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డుకు (Aadhaar Card) ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. ప్రతి భారతీయ పౌరునికి ఇది తప్పనిసరిగా మారింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఈ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌లా మాత్రమే కాదు ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందాలన్నా కీలకంగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు (Aadhaar Card) కోసం నమోదు చేసుకోవచ్చు. అయితే 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డును బాల్ ఆధార్ కార్డు అంటారు. ఈ ఆధార్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.
భారత ప్రభుత్వం పిల్లల కోసం బాల్ ఆధార్ పేరుతో ప్రత్యేక ఆధార్ కార్డును జారీ చేస్తోంది. ఇది నీలం రంగులో, సాధారణ కార్డుకు కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణ ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేస్తామో దీన్ని కూడా అలాగే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ (PoA), ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ (PoR), పిల్లల పుట్టిన తేదీ (DoB) డాక్యుమెంట్లను జతచేయాల్సి ఉంటుంది. యూఐడీఏఐ మొత్తం 31 ఐడెంటిటీ ప్రూఫ్, 44 అడ్రస్ ప్రూఫ్, 14 ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్, 14 డేటా ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అంగీకరిస్తుంది. వీటిలో దేన్నైనా సబ్మిట్ చేయవచ్చు.
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ నీలం రంగులోని బాల్ ఆధార్ కార్డును పొందేందుకు అర్హులు. వారికి ఐదేళ్లు దాటిన తర్వాత బాల్ ఆధార్ చెల్లదు. ఆ తర్వాత అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల స్కూల్లో ఇచ్చే ఐడెంటిటీ కార్డును ఉపయోగించి ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
చిన్నారుల బయోమెట్రిక్ ఆధార్ డేటాను 5 సంవత్సరాల వయస్సులో, మళ్లీ 15 సంవత్సరాల వయస్సులో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సి అవసరం లేదు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి తీసుకున్న డిశ్చార్జ్ స్లిప్‌తో బాల ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల ఆధార్ డేటాలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ సమాచారం ఉండదు. 5 ఏళ్లు దాటిన తర్వాత, బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.