మీరు ఆధార్ కార్డ్ (Aadhaar Card) తీసుకొని పదేళ్లు దాటిందా? ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారి కూడా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయలేదా? అయితే అలర్ట్. మీరు వెంటనే మీ ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) చేయాలని కోరుతోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు అవాస్తవని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ స్పష్టం చేసింది. ఈ వార్తల్ని, సోషల్ మీడియా పోస్టుల్ని పట్టించుకోవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి కాకపోయినా, చేయడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.
పదేళ్ల క్రితం ఆధార్ కార్డ్ తీసుకున్నవాళ్లు గతంలో ఉన్న ఐడీ ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ ఇచ్చి ఎన్‌రోల్ చేసుకొని ఉంటారు. అప్పట్లో ఎన్‌రోల్ చేసుకున్న ఆధార్‌లో ఏవైనా తప్పులు ఉండొచ్చు. లేదా ఏవైనా మార్పులు ఉండొచ్చు. ఈ పదేళ్లలో వాటిని సరిచేసుకోనివాళ్లు, ఇప్పుడు ఆధార్ అప్‌డేట్ చేయిస్తే ఉపయోగాలు ఉంటాయి. ప్రస్తుతం పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) లాంటి ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరి అవుతోంది. కాబట్టి ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం లబ్ధిదారులకు అవసరం.
Account Transfer: ఆన్‌లైన్‌లోనే వేరే బ్రాంచ్‌కు ఎస్‌బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండిలా
ఓసారి మీ ఆధార్ కార్డ్ చెక్ చేసుకొని అందులో మార్పులు ఉంటే అప్‌డేట్ చేయాలి. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచచు. వీటిని అప్‌డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్‌లైన్‌లో ఈ వివరాలు ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 3- Online Update Services పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
Step 5- Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.
IRCTC Kashmir Tour: వైజాగ్ టు కాశ్మీర్... తక్కువ ధరకే 6 రోజుల ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్‌డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్‌షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో అప్‌డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI