Home /News /business /

UIDAI ASKS AADHAAR CARD HOLDERS TO VERIFY THEIR REGISTERED MOBILE NUMBER AND EMAIL ID SS GH

Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త

Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Fraud | మీ దగ్గర ఆధార్ కార్డు (Aadhaar Card) ఉందా? ఇటీవల ఆధార్ కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. మరి మీరు కూడా మోసపోవద్దంటే ఆధార్ కార్డ్ విషయంలో ఏం చేయాలో తెలుసుకోండి.

భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు (Aadhaar Card) ఉండటం తప్పనిసరి అయింది. పాన్ కార్డు తీసుకోవాలన్నా.. లైసెన్స్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు (Aadhaar Card) ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ఇది మీ ప్రతి ఒక్క డాక్యుమెంట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డులో పొందుపరిచిన మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆధార్ ఆన్‌లైన్ సేవలను పొందడానికి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ తప్పనిసరి కావడంతో కార్డుదారులు తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆధార్ మోసాలకు బాధితులయ్యే ప్రమాదం ఉంది. తాజాగా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు యూజర్లు తమ మొబైల్ నంబర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

IMPS Transaction: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్... లిమిట్ పెంచిన ఆర్‌బీఐ

మోసగాళ్ల గురించి కార్డుదారులను హెచ్చరిస్తూ యూఐడీఏఐ ట్విట్టర్ లో ఒక పోస్ట్‌ షేర్ చేసింది. మీ లేటెస్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఆధార్‌తో కరెక్ట్ గా లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి https://resident.uidai.gov.in/verify-email-mobile లింక్‌ని విజిట్ చేసి నిర్ధారించవచ్చని తెలిపింది. ఆధార్ నంబర్ నమోదు చేసిన సమయంలో పొందుపరిచిన నంబర్ లేదా ఇటీవలే ఆధార్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసిన నంబర్ ను వెరిఫై చేసుకునేందుకు ఈ లింక్‌ని సందర్శించాలి. ఆ తర్వాత కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

Aadhaar Card Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయాలా? తెలుగులో సింపుల్‌గా చేయండి ఇలా

Aadhaar Card: ఆధార్ కార్డుకు లింక్ అయిన ఇమెయిల్, మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి ఇలా


Step 1- యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ని విజిట్ చేయండి. లేదా https://resident.uidai.gov.in/verify-email-mobile అని మీ బ్రౌజర్ లో టైప్ చేసి ఎంటర్ చేయండి.

Step 2- ఒకవేళ మీరు అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లినట్లయితే "మై ఆధార్‌" పై క్లిక్ చేయండి.

Step 3- ఆధార్ సర్వీసెస్ (Aadhaar Services) ఆప్షన్ పై క్లిక్ చేసి ఈమెయిల్/మొబైల్ నంబర్‌(Verify Email/Mobile Number) ఆప్షన్ సెలక్ట్ చేయండి.

Step 4- మీ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ (UID) ని నమోదు చేయండి.

Step 5- మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ కాంటాక్ట్ డీటెయిల్స్ పొందుపరచండి.

Step 6- క్యాప్చా వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి.

Step 7- ఇప్పుడు సెండ్ ఓటీపీ (Send OTP) ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Cash Withdrawal: చనిపోయినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే

మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ యూఐడీఏఐ రికార్డ్‌ల్లోని నంబర్ తో మ్యాచ్ అయితే.. స్క్రీన్‌పై మీ నంబర్ ఆల్రెడీ వెరిఫై అయిందని ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ యూఐడీఏఐ రికార్డులతో మ్యాచ్ కానట్లయితే.. మీరు నమోదు చేసిన నంబర్ యూఐడీఏఐ రికార్డుల్లో వెరిఫై కాలేదని ఒక మెసేజ్ కనిపిస్తుంది అప్పుడు మీరు సమీప ఆధార్ సెంటర్ కి వెళ్లి మళ్లీ నంబర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఆన్ లైన్ లో చేయడం కుదరదు అనేది గుర్తుంచుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు