UIDAI ASKS AADHAAR CARD HOLDERS TO REGISTER COMPLAINT IF AADHAAR CENTER CHARGES EXTRA FOR VARIOUS AADHAAR SERVICES SS
Aadhaar Charges: ఆధార్ సెంటర్లో ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారా? ఇలా కంప్లైంట్ చేయండి
Aadhaar Charges: ఆధార్ సెంటర్లో ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారా? ఇలా కంప్లైంట్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Aadhaar Charges | ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయమని కోరుతోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.
మీ ఆధార్ కార్డులో మార్పుల కోసం ఆధార్ సెంటర్కు వెళ్లారా? ఆధార్ సేవా కేంద్రంలో మీ నుంచి ఎక్కువగా ఛార్జీలు వసూలు చేశారా? అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI కి కంప్లైంట్ చేయొచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో లేదా ఆధార్ సెంటర్లో మీ నుంచి ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నట్టైతే యూఐడీఏఐకి ఫిర్యాదు చేయొచ్చు. 1947 నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. లేదా help@uidai.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ పంపి మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. లేదంటే నేరుగా https://resident.uidai.gov.in/file-complaint ఈ లింక్ క్లిక్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఆధార్ సెంటర్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్టైతే పైన చెప్పిన మార్గాల్లో ఫిర్యాదు చేయాలని యూఐడీఏఐ ఆధార్ కార్డ్ హోల్డర్లను కోరుతోంది. యూఐడీఏఐ నిర్ణయించిన ఛార్జీల కన్నా ఎక్కువ వసూలు చేస్తే కంప్లైంట్ చేయమంటోంది.
ఆధార్ సెంటర్లో కొన్ని సేవలు ఉచితం. కొన్ని సేవలకు మాత్రమే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఛార్జీలను కూడా యూఐడీఏఐ నిర్ణయించింది. అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్ సెంటర్లతో పాటు ఆధార్ సేవా కేంద్రాల్లో ఛార్జీలు ఒకేలా ఉంటాయి. ఏఏ సేవలకు ఎంత ఛార్జీ చెల్లించాలో తెలుసుకోండి.
యూఐడీఏఐ 2021 ఏప్రిల్ 12న ప్రకటించిన ఛార్జీలు ఇవి. దేశంలోని అన్ని ఆధార్ సెంటర్లు, ఆధార్ సేవా కేంద్రాల్లో ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. ఆధార్ కార్డ్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో తమ వివరాలు అప్డేట్ చేయడానికి వెళ్తుంటారు. అయితే చాలావరకు ఆధార్ సెంటర్లలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంటారు. అసలు ఛార్జీలు ఎంతో అవగాహన లేక ఆధార్ కార్డ్ హోల్డర్లు ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తుంటారు. అందుకే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు ఛార్జీల వివరాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆధార్ సేవలకు ఎంత ఛార్జీలు ఉంటాయో ఆ వివరాలు https://uidai.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.