ఆధార్ కార్డ్... అందరికీ అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్. ఈ రోజుల్లో చాలా పనులు, లావాదేవీలు, వ్యవహారాలన్నీ ఆధార్ కార్డుతో ముడిపడిపోయాయి. ఆధార్ కార్డు ఉన్నవారికి ఆధార్ సేవలు కూడా కీలకమయ్యాయి. అందుకే ఆధార్ సేవల్ని సామాన్యులకు వీలైనంత వేగంగా అందుబాటులో ఉంచేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI కృషి చేస్తోంది. ఇప్పటికే ఎంఆధార్ యాప్‌ను రూపొందించింది. ఈ ఒక్క యాప్ ఉంటే ఏకంగా 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు. ఎంఆధార్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి. అయితే స్మార్ట్‌ఫోన్ లేనివాళ్లు కూడా ఎస్ఎంఎస్ ద్వారా అనేక రకాల ఆధార్ సేవలు పొందొచ్చు. ఇందుకోసం ఆధార్ ఎస్ఎంఎస్ సర్వీస్‌ని అందిస్తోంది యూఐడీఏఐ.
Aadhaar SMS service: ఎస్ఎంఎస్తో ఆధార్ సేవలు పొందండి ఇలా
ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఆధార్ సేవలు పొందాలనుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా మీరు వర్చువల్ ఐడెంటిటీ జనరేట్ చేయొచ్చు. మీ ఆధార్ నెంబర్‌ను లాక్, అన్‌లాక్ కూడా చేయొచ్చు. ఇందుకోసం మీరు యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్లోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 0123 4567 8910 అయితే ఆధార్ సేవల్ని పొందేందుకు ఏఏ ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాలో తెలుసుకోండి.
వర్చువల్ ఐడీ క్రియేట్ చేయడానికి మీరు 1947 నెంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. GVID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్లోని చివరి నాలుగు డిజిట్స్ని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అంటే GVID 8910 అని టైప్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్‌కు వర్చువల్ ఐడీ వస్తుంది. ఒకవేళ మీ వర్చువల్ ఐడీ మర్చిపోయినట్టైతే రిట్రీవ్ చేయొచ్చు. ఇందుకోసం RVID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్లోని చివరి నాలుగు డిజిట్స్ని ఎస్ఎంఎస్ చేయాలి.

ప్రతీకాత్మక చిత్రం
ఇక ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ లాక్ చేయడానికి GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. అంటే GETOTP 8910 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. UIDAI నుంచి మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఆ తర్వాత LOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు, మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీకు వచ్చిన ఓటీపీ 123456 అనుకుంటే LOCKUID 8910 123456 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ ఎస్ఎంఎస్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే ఆధార్ నెంబర్లోని చివరి 8 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది.
ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ అన్‌లాక్ చేయడానికి GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ముందే క్రియేట్ చేసిన వర్చువల్ ఐడీ నెంబర్లోని చివరి 6 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ వస్తుంది. తర్వాత UNLOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వర్చువల్ ఐడీలో చివరి 6 అంకెలు మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఎస్ఎంఎస్ వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే వర్చువల్ ఐడీలోని చివరి 10 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
SBI News: ఎస్బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకు తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే
Save Money: కోటీశ్వరులు కావాలా? ఈ జపనీస్ టెక్నిక్ ట్రై చేయండి
PMVVY Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 పెన్షన్... మార్చి 31 చివరి తేదీPublished by:Santhosh Kumar S
First published:March 18, 2020, 12:42 IST