హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Update: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... UIDAI నుంచి ముఖ్యమైన సలహా

Aadhaar Update: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... UIDAI నుంచి ముఖ్యమైన సలహా

Aadhaar Update: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... UIDAI నుంచి ముఖ్యమైన సలహా
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Update: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... UIDAI నుంచి ముఖ్యమైన సలహా (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Update | ఆధార్ కార్డ్ ఉన్నవారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ముఖ్యమైన సలహా ఇస్తోంది. ఆధార్ కార్డ్ (Aadhaar Card) వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఆధార్ కార్డ్... ఇప్పుడు భారత పౌరులకు తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ (Bank Account) దగ్గర్నుంచి ప్రభుత్వ పథకాల (Govt Schemes) వరకు ప్రతీ చోటా ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అవుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) లాంటి పథకాల్లో లబ్ధిదారుల్ని గుర్తించి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆధార్ డేటానే పరిగణలోకి తీసుకుంటోంది. ఇలా చాలా చోట్ల ఆధార్ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. అందుకే ఆధార్ కార్డును ఎప్పుడూ జేబులో పెట్టుకొని ఉండటం చాలామందికి అలవాటు.

పర్సులో ఆధార్ కార్డ్ లేకపోతే అప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో ఇ-ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). అయితే ఇలా ఎక్కడపడితే అక్కడ ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం ఆధార్ కార్డ్ హోల్డర్ల డేటాను రిస్కులో పడేస్తోంది. పబ్లిక్ కంప్యూటర్‌లో అంటే ఎక్కడైనా ఇంటర్నెట్ సెంటర్‌లో ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం, పని పూర్తయ్యాక ఆ ఫైల్‌ను అలాగే వదిలేయడం మంచి అలవాటు కాదు. ఎక్కడైనా పబ్లిక్ కంప్యూటర్‌లో ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేస్తే తప్పనిసరిగా డిలిట్ చేయాలని సూచిస్తోంది యూఐడీఏఐ.

Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? కొత్త రూల్స్ తెలుసుకోండి

ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం కన్నా మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేయడం మంచిదని యూఐడీఏఐ సలహా ఇస్తోంది. ఇ-ఆధార్ కార్డులో ఆధార్ నెంబర్ , ఇతర వివరాలన్నీ ఉంటాయి. కానీ మాస్క్‌డ్ ఆధార్‌లో వ్యక్తిగత సమాచారం హైడ్ అవుతుంది. ఇందులో ఆధార్ నెంబర్ పూర్తిగా కనిపించదు. మొదటి 8 అంకెలు హైడ్ అవుతాయి. వాటి స్థానంలో xxxx-xxxx లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మరి మాస్క్‌డ్ ఆధార్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

Aadhaar Card Update: మీ ఆధార్‌లో ఈ వివరాలున్నాయా? అప్‌డేట్ చేయండిలా

మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Step 1- ముందుగా https://eaadhaar.uidai.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయండి.

Step 2- మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌తో లాగిన్ అవండి.

Step 3- ఆ తర్వాత మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Step 4- 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి I want a masked Aadhaar ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Step 5- క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయండి.

Step 6- ఆ తర్వాత Download Aadhaar పైన క్లిక్ చేస్తే మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

మాస్క్‌డ్ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ చేయొచ్చు. మీ మొదటి పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు Ramesh అనే వ్యక్తి 1980 లో పుట్టారనుకుందాం. పాస్‌వర్డ్ RAME1980 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పూర్తి ఆధార్ నెంబర్ అవసరం లేనిచోట మీరు మాస్క్డ్‌ ఆధార్ ఉపయోగించవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు