Home /News /business /

UDYOGINI SCHEME OFFERS UP TO RS 300000 LOAN TO WOMEN ENTREPRENEURS KNOW HOW TO APPLY SS

Udyogni Scheme: మహిళల కోసం ఉద్యోగిని స్కీమ్... రూ.3,00,000 వరకు లోన్

Udyogni Scheme: మహిళల కోసం ఉద్యోగిని స్కీమ్... రూ.3,00,000 వరకు లోన్
(ప్రతీకాత్మక చిత్రం)

Udyogni Scheme: మహిళల కోసం ఉద్యోగిని స్కీమ్... రూ.3,00,000 వరకు లోన్ (ప్రతీకాత్మక చిత్రం)

Udyogni Scheme | ఉద్యోగిని స్కీమ్ ద్వారా మహిళలు రూ.3,00,000 వరకు బిజినెస్ లోన్స్ తీసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. మహిళా ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 'ఉద్యోగిని' పేరుతో రుణాలను అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు రూ.3,00,000 వరకు తక్కువ వడ్డీకే రుణాలు తీసుకొని వ్యాపారాలు మొదలు పెట్టొచ్చు. పలు ఫైనాన్షియల్ సంస్థలతో కలిసి వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ రుణాలను అందిస్తోంది. నిరుపేద మహిళలు కూడా వ్యాపారాలు చేసేందుకు ఆర్థిక అవరోధాలు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రారంభించిన స్కీమ్ ఇది. పలు ఆర్థిక సంస్థలు 'ఉద్యోగిని' పేరుతో రుణాలను ఇస్తున్నాయి. ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా మహిళల్లో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రమోట్ చేయడం, ఆర్థిక సాధికారత కల్పించడం, మహిళల్లో స్వావలంబన కోసం ఈ స్కీమ్ ఉపయోగపడుతోంది.

    Insurance: ఈ స్కీమ్‌లో ఉన్నవారికి రూ.2,00,000... ఒక్క ఏడాదిలో రూ.4,698 కోట్లు చెల్లించిన కేంద్ర ప్రభుత్వం

    UMANG App: ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ డబ్బులు డ్రా చేయండి ఇలా

    'ఉద్యోగిని' స్కీమ్ ద్వారా మహిళలు రూ.3,00,000 వరకు వడ్డీ లేని రుణాలను పొందొచ్చు. కేవలం రుణాలు ఇవ్వడమే కాదు... వ్యాపారులు నిర్వహించడం, ధరల్ని నిర్ణయించడం లాంటి అంశాల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది. మహిళలు ఎవరైనా 'ఉద్యోగిని' స్కీమ్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. కేవలం మహిళలకు మాత్రమే ఇచ్చే రుణాలు ఇవి. 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు వారు ఈ రుణాలకు అప్లై చేయొచ్చు. వారి కుటుంబ వార్షికాదాయం రూ.1,50,000 లోపు ఉండాలి. అంతకన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి ఈ రుణాలు వర్తించవు. వితంతువు, వికలాంగ మహిళలకు వార్షికాదాయం లిమిట్ వర్తించదు.

    SBI Scheme: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు... స్కీమ్ వివరాలివే

    EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఈపీఎఫ్ఓ తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే

    'ఉద్యోగిని' స్కీమ్ ద్వారా రుణాలు ఇస్తున్న ఆర్థిక సంస్థల్ని సంప్రదించి అప్లై చేయాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కో-ఆపరేటీవ్ బ్యాంకులు ఈ రుణాలను ఇస్తాయి. రుణాలు తీసుకోవడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ కార్డ్ ఉండాలి. వీటితో పాటు ఇన్‌కమ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. అకౌంట్‌హోల్డర్ పేరుతో బ్యాంక్ పాస్‌బుక్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ ఉండాలి. 88 రకాల చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలకు ఈ రుణాలు తీసుకోవచ్చు. అగర్‌బత్తీ తయారీ, బేకరీ, గాజుల తయారీ, బ్యూటీ పార్లర్, క్యాంటీన్, కేటరింగ్, క్లీనింగ్ పౌడర్, కాఫీ, టీపౌడర్ తయారీ, డయాగ్నస్టిక్ ల్యాబ్, డ్రైక్లీనింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, జిమ్, ఐస్‌క్రీమ్ పార్లర్ లాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరిధిలోకి వచ్చే 88 రకాల వ్యాపారాలకు ఈ రుణాలు తీసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loan, Bank loans, Business, Business Ideas, BUSINESS NEWS, Business woman, Online business, Personal Finance, Small business, Young woman entrepreneur

    తదుపరి వార్తలు