హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates: కస్టమర్లకు బంపర్ బొనాంజా.. బ్యాంక్ కీలక నిర్ణయం!

FD Rates: కస్టమర్లకు బంపర్ బొనాంజా.. బ్యాంక్ కీలక నిర్ణయం!

 UCO Bank, FD rates, fixed deposits, banks, యూకో బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎఫ్‌డీ రేట్లు, బ్యాంక్

UCO Bank, FD rates, fixed deposits, banks, యూకో బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎఫ్‌డీ రేట్లు, బ్యాంక్

Fixed Deposits | బ్యాంక్‌లో డబ్బు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. దీంతో కస్టమర్లకు ఊరట కలుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Bank FD Rates | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యూకో బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. పండుగ ముందు కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కస్టమర్లకు గతంలో కన్నా ఇకపై అధిక రాబడి వస్తుంది.

బ్యాంక్ తాజాగా రూ. 2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే .. ఇప్పటికే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. ఇప్పుడు ఏ ఏ టెన్యూర్‌పై ఎంత వడ్డీ రేటు పెరిగిందో ఒకసారి తెలుసుకుందాం.

లోన్ తీసుకునే వారికి బ్యాంకుల బంపరాఫర్.. చౌక వడ్డీకే రుణాలు!

యూకో బ్యాంక్ 9 రోజుల వరకు టెన్యూర్‌పై 2.9 శాతం వడ్డీని అందిస్తోంది. 45 రోజుల వరకు టెన్యూర్‌పై 3 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. 46 రోజుల నుంచి 120 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం వడ్డీ పొందొచ్చు. 121 రోజుల నుంచి 150 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. అలాగే 151 రోజుల నుంచి 180 రోజుల ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ వస్తోంది. 181 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు.

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. పండుగ ముందు దిగివచ్చిన గోల్డ్ రేట్లు!

ఏడాది కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. 6.5 శాతం నుంచి 6.75 శాతానికి ఎగసింది. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై బ్యాంక్ 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. యూకో బ్యాంక్ అలాగే రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎప్‌డీలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 6.2 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది.

మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.2 శాతంగా ఉంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.1 శాతంగా ఉంది. ఇక 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 7 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. ఇదివరకు ఈ టెన్యూర్‌పై 6.5 శాతం వడ్డీ ఉండేది. అంటే వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు పైకి చేరిందని చెప్పుకోవచ్చు. 666 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి 7.15 శాతానికి ఎగసింది. సీనియర్ సిటిజన్స్‌కు 1 శాతం అదనపు వడ్డీ రేటు బెనిఫిట్ లభిస్తుంది.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits, Money, UCO Bank

ఉత్తమ కథలు