హోమ్ /వార్తలు /బిజినెస్ /

Fixed Deposits: కస్టమర్లకు బంపర్ గిఫ్ట్ అందించిన బ్యాంక్.. కీలక నిర్ణయం!

Fixed Deposits: కస్టమర్లకు బంపర్ గిఫ్ట్ అందించిన బ్యాంక్.. కీలక నిర్ణయం!

 Fixed Deposits: కస్టమర్లకు బంపర్ గిఫ్ట్ అందించిన బ్యాంక్.. కీలక నిర్ణయం!

Fixed Deposits: కస్టమర్లకు బంపర్ గిఫ్ట్ అందించిన బ్యాంక్.. కీలక నిర్ణయం!

Interest Rates | మీరు బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలని చూస్తున్నారా? అయితే తాజాగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. వడ్డీ రేట్లు భారీగా పెంచేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

FD Rates | బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు. డబ్బులు దాచుకోవాలని భావించే వారికి తీపికబురు. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకల్లో ఒకటైన యూకో బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపిజిట్లపై (Fixed Deposits) వడ్డీ రేట్లు పెంచేసింది. రూ. 2 కోట్లకు లోపు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. అంటే బ్యాంక్‌లో (Banks) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి గతంలో కన్నా ఇకపై అధిక వడ్డీ లభిస్తుందని చెప్పుకోవచ్చు.

బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఎఫ్‌డీ రేట్ల పెంపు నిర్ణయం డిసెంబర్ 2 నుంచి అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఏకంగా 135 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. 46 రోజుల నుంచి 666 రోజుల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ అందిస్తున్న 666 రోజుల ఎఫ్‌డీలపై కస్టమర్లు ఎక్కువగా 6.5 శాతం వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు.

బంగారం, వెండి కొనాలనుకునే వారికి భారీ షాక్!

7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంది. 30 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే 3 శాతం వడ్డీని అందిస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజుల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 4 శాతానికి చేరింది. 91 రోజుల నుంచి 120 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. 121 నుంచి 150 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 3.75 శాతం. 151 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5 శాతానికి చేరింది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 3.75 శాతం మాత్రమే. అంటే వడ్డీ రేటు ఏకంగా 125 బేసిస్ పాయింట్లు పెరిగింది.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్ టికెట్ ఫ్రీ!

అలాగే 181 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు ఏకంగా 135 బేసిస్ పాయింట్లు పెరిగింది. 4.65 శాతం నుంచి 6 శాతానికి చేరింది. ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.75 శాతం నుంచి 6.35 శాతానికి ఎగసింది. ఏడాది నుంచి రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.20 శాతానికి చేరింది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 5.75 శాతం. రెండేళ్ల నుంచి 5 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతానికి చేరింది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 5.6 శాతం.

అలాగే ఐదేళ్ల నుంచి ఆపైన టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. 444 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.15 శాతం నుంచి 6.25 శాతానికి చేరింది. 666 రోజుల ఎఫ్‌డీలపై అయితే 6.5 శాతం వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు, బ్యాంక్ సిబ్బందికి అదనపు వడ్డీ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits, Personal Finance, UCO Bank

ఉత్తమ కథలు