UBER RATING HOW IS IT CALCULATED FOR RIDERS HOW TO CHECK GH VB
Uber Rating: ఉబెర్ డ్రైవర్‌కే కాదు.. కార్లో ప్రయాణించిన మీకూ రేటింగ్ ఉంటుందని తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
ట్యాక్సీ బుకింగ్ కోసం ఉబెర్ యాప్‌ను వాడుతున్నారా? రైడ్ పూర్తవ్వగానే డ్రైవర్ ప్రవర్తన(Uber Driver), ట్యాక్సీ శుభ్రత వంటి అంశాల ఆధారంగా ఓ రేటింగ్ ను ఇస్తుంటారు.
ట్యాక్సీ బుకింగ్ కోసం ఉబెర్ యాప్‌ను వాడుతున్నారా? రైడ్ పూర్తవ్వగానే డ్రైవర్ ప్రవర్తన(Uber Driver), ట్యాక్సీ శుభ్రత వంటి అంశాల ఆధారంగా ఓ రేటింగ్ ను ఇస్తుంటారు. అలాగే రైడ్ చేసే మీకు రేటింగ్(Uber Rating) ఉంటుందని తెలుసా? దాన్ని ఉబెర్ ఎలా గణిస్తుందో తెలుసా? అసలు ఉబెర్ యాప్‌లో రేటింగ్(Uber App Rating) సిస్టమ్ ఎలా ఉంటుంది? వంటి పలు ప్రశ్నలు మీకు ఉంటే.. స్వయంగా కంపెనీ ఓ స్పష్టతనిచ్చింది. వాస్తవానికి యాప్ ద్వారా మనం బుక్ చేసుకున్న ట్యాక్సీలో ప్రయాణం అనంతంరం డ్రైవర్లకు రేటింగ్ ఇస్తుంటాం. అలాగే డ్రైవర్లు (Drivers) సైతం రైడర్లకు(Rider) రేటింగ్ (Rating) ఇస్తారని మనలో చాలామందికి తెలియదు. ఈ రేటింగ్ ల ద్వారానే మీకు వీలైనంత త్వరగా ట్యాక్సీ కేటాయింపు జరుగుతుంది తెలుసా.
అందుకే డ్రైవర్లాగానే, రైడర్లు సైతం తమ Uber రేటింగ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతేగాకుండా అది కనిష్ఠానికి పడిపోకుండా చూసుకోవాలి. కానీ ఓ వ్యక్తికి ఈ రేటింగ్ ను ఎలా లెక్కిస్తారో మాత్రం ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు. అయితే ‘బెస్ట్ రైడర్ గా ఉండేందుకు మీ రేటింగ్ ను ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి’ అంటూ ఈ మధ్య ఓ బ్లాగ్ లో ఉబెర్ సంస్థ పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి తొలిసారి తమ వద్ద ఉన్న గుడ్, బ్యాడ్ రేటింగ్‌ల డేటాను పంచుకుంది.
Uber యాప్ లోని ప్రైవసీ సెంటర్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఎంతమంది డ్రైవర్లు తమకు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను ఇచ్చారు. ఎవరు కేవలం ఒకే స్టార్ రేటింగ్ ను అందించారు వంటి విషయాలను వినియోగదారులు చూడొచ్చు. ఈ డేటా Uber వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీనిని ఆన్లైన్లో లేదా యాప్‌లో అకౌంట్లో లాగిన్ అవ్వడం ద్వారా చూడొచ్చు. గత 500 రైడ్ల సగటులో నుంచి ఈ రేటింగ్ ను ఎంపిక చేస్తారు.
Uber రేటింగ్స్ యాక్సెస్ చేయండిలా...
సెట్టింగ్స్ మెనూలో ప్రైవసీపై క్లిక్ చేయాలి. ఆపై ప్రైవసీ సెంటర్ కి వెళ్లాలి.
అక్కడ కుడివైపు స్వైప్ చేసి how you use Uber అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
కిందికి స్క్రోల్ చేసి బ్రౌజ్ యువర్ డేటాను సెలక్ట్ చేయాలి.
అక్కడ కనిపించే “వ్యూ మై రేటింగ్స్’’ పై నొక్కండి. మీరిచ్చిన రేటింగ్‌లతో పాటు.. డ్రైవర్ రేటింగ్‌లు డిస్ ప్లే అవుతాయి. మీ రేటింగ్ ఎలా చేశారో చూసేందుకు డ్రైవర్ రేటింగ్‌లపై నొక్కండి.
ఇలా ప్రైవసీ సెంటర్లో రేటింగ్లను తెలుసుకోవడంతో పాటు.. వినియోగదారులు వారి గత పర్యటనల సమాచారం, చెల్లింపు వివరాలు, యాడ్ ల ప్రాధాన్యతలు, నియంత్రణ వంటివి సమీక్షించవచ్చని ఉబెర్ తెలిపింది.
ఇక మెరుగైన యూజర్ రేటింగ్లను పొందేందుకు Uber కొన్ని చిట్కాలను సైతం అందించింది. డ్రైవర్లు తమ వాహనాన్ని శుభ్రంగా ఉంచాలని, చెప్పిన సమయానికి రావాలని, కస్టమర్లకు గౌరవమివ్వాలని, డోర్లను గట్టిగా వేయొద్దని సూచిచింది. ఇక వెనుక భాగంలో కూర్చున్న రైడర్లు సైతం సీట్‌బెల్ట్ ధరించాలని చెబుతోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.