హోమ్ /వార్తలు /బిజినెస్ /

Uber Services: బస్సు సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైన ఉబెర్.. ఆ నగరాల్లో ముందుగా ప్రారంభం..

Uber Services: బస్సు సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైన ఉబెర్.. ఆ నగరాల్లో ముందుగా ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్ సేవల సంస్థ ఉబెర్ (Uber) తన సర్వీసెస్‌ను విస్తరిస్తోంది. ఈ క్యాబ్‌ అగ్రిగేటర్‌ కంపెనీ కార్ల ద్వారా మాత్రమే కాకుండా ఇతర వాహనాల ద్వారా కూడా సేవలను అందించాలని యోచిస్తోంది.

ప్రముఖ ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్(Tax Booking) సేవల సంస్థ ఉబెర్ (Uber) తన సర్వీసెస్‌ను విస్తరిస్తోంది. ఈ క్యాబ్‌ అగ్రిగేటర్‌(Aggregator) కంపెనీ కార్ల ద్వారా మాత్రమే కాకుండా ఇతర వాహనాల ద్వారా కూడా సేవలను అందించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బస్ సర్వీసెస్ (Bus Services) కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ బస్ సర్వీసెస్‌ను ఇండియాలో విస్తరించేందుకు ఉబెర్ ప్లాన్(Uber Plan) చేస్తోంది. రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ ఇండియా (India)లో తన బస్సు సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఒక లేటెస్ట్(Latest)నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, సరికొత్త బస్సు సేవలను గురుగ్రామ్, ఢిల్లీలో ఉబెర్ ప్రారంభించనుంది. ఈ సర్వీసెస్ ప్రజలకు చాలా ఉపయోగపడతాయి.

ఇన్‌సైడర్ గ్లోబల్ ట్రెండ్స్ (Insider Global Trends) ఫెస్టివల్ 2020లో ఉబెర్ ఆసియా-పసిఫిక్ (APAC) మొబిలిటీ ప్రెసిడెంట్, ప్రదీప్ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఇండియాలో బస్సు సేవలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కంపెనీ ప్రణాళికలను కూడా వెల్లడించారు. 2020లో ఈజిప్టులో ఉబెర్ తన బస్సు సేవలను తొలిసారిగా ప్రారంభించింది. ఇప్పుడు గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ తొమ్మిది నెలల ట్రయల్ పీరియడ్ కోసం ఉబెర్ బస్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. అలానే ఢిల్లీలో ఎయిర్ కండిషన్డ్ బస్సులలో ప్రయాణికులకు సీటు రిజర్వు చేసే కొత్త సేవను ఉబెర్ ప్రారంభిస్తోంది. ఇలా కస్టమర్లు ఉబెర్ యాప్ ద్వారా బస్ సీట్లను రిజర్వ్ చేసుకోవడానికి ప్రైవేట్ బస్సు కంపెనీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని బస్సు సంస్థలతో ఉబెర్ పని చేస్తోంది. ప్లాట్‌ఫామ్‌లో ప్రైవేట్, గవర్నమెంట్ రెండూ సంస్థల బస్సుల్లో సీట్ బుకింగ్ ఆఫర్ చేయడమే ఉబెర్ లక్ష్యంగా పెట్టుకుంది. మరింత సరసమైన, సౌకర్యవంతమైన ప్రజా ప్రయాణాన్ని ఆఫర్ చేయడమే లక్ష్యంగా ఉబెర్ అడుగులు వేస్తోందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ పేర్కొంది.

Will Planning: ఆస్తులను పంచేందుకు వీలునామా రాస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..


“మొదట్లో, మేం కార్లతో బిజినెస్ ప్రారంభించాం, మా వద్ద ఆటోరిక్షాలు కూడా ఉన్నాయి. మేం బైక్-టాక్సీలను కూడా పరిచయం చేయనున్నాం. ఇప్పుడు ఉబెర్ బస్ సేవల పై దృష్టి సారిస్తున్నాం. ఎందుకంటే మాకు రకరకాల కస్టమర్లు ఉన్నారు." అని ఉబెర్‌ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ అయిన మణికందన్ తంగరత్నం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. భారతదేశంలో ఉబెర్ బిజినెస్-టు-బిజినెస్ పద్ధతిలో మాత్రమే బస్సు సర్వీస్‌ను ఆఫర్ చేస్తుందని గమనించాలి.

బస్-ఫోకస్డ్ ప్రోగ్రామ్‌ను ఇండియాలోని ఆఫీస్ ఉద్యోగులు, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లను దృష్టిలో ఉంచుకుని ఉబెర్ రూపొందించింది. ఈజిప్టులో 2018 నుంచి బస్ సేవను పరీక్షిస్తున్న ఉబెర్ కంపెనీ మొదటిసారిగా 'ఉబెర్ బస్'ని అధికారికంగా ప్రారంభించింది. తర్వాత ఉక్రెయిన్, మెక్సికోకు విస్తరించింది. ఉబెర్ పరమేశ్వరన్ ప్రతి ఒక్కరి డిమాండ్‌లను సంతృప్తిపరిచే షేర్డ్ మొబిలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తమ వద్ద ఉందన్నారు. కిలోమీటరుకు రూ.5, రూ.15 లేదా రూ.50 ఖర్చు చేసినా, షేర్డ్ మొబిలిటీ ప్రత్యామ్నాయం అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు.

Bank FDs: HDFC బ్యాంక్ vs ICICI బ్యాంక్ vs SBI.. మూడు బ్యాంకుల తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే..


2021, సెప్టెంబరులో కంపెనీ ఉబెర్ కార్పొరేట్ షటిల్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్ సురక్షితంగా, సరసమైన ధరల్లో ఉద్యోగులు ఆఫీస్‌లకు చేరుకోవడానికి, తిరిగి ఇంటికి రావడానికి సహాయపడుతుంది. ఈ సర్వీస్ ఒకే వాహనంలో గరిష్టంగా 50 మంది ఉద్యోగులకు సీట్లను అందిస్తుంది. ఈ సేవల వల్ల సిటీల్లో రద్దీని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, వర్క్‌ప్లేస్ పార్కింగ్ స్పాట్‌లను ఖాళీ చేయడం సాధ్యమవుతుంది. ఉబెర్ కార్పొరేట్ షటిల్ సేవలో రైడర్లు, డ్రైవర్లు ఇద్దరికీ మస్క్ తప్పనిసరి చేసింది. డ్రైవర్ల కోసం ప్రీ-ట్రిప్ మాస్క్ వెరిఫికేషన్ సెల్ఫీలు, భద్రతా ప్రమాణాల నిర్వహణ విధానాలపై డ్రైవర్ ఎడ్యుకేషన్‌ వంటి సేఫ్టీ మెజర్స్ పాటించింది.

First published:

Tags: Bus services, Cab services, Uber

ఉత్తమ కథలు