హోమ్ /వార్తలు /బిజినెస్ /

Uber CEO: డెలివరీ బాయ్‌గా మారిన ఉబెర్ సీఈఓ... కారణం ఏంటంటే?

Uber CEO: డెలివరీ బాయ్‌గా మారిన ఉబెర్ సీఈఓ... కారణం ఏంటంటే?

Uber CEO: డెలివరీ బాయ్‌గా మారిన ఉబెర్ సీఈఓ... కారణం ఏంటంటే?
(ప్రతీకాత్మక చిత్రం)

Uber CEO: డెలివరీ బాయ్‌గా మారిన ఉబెర్ సీఈఓ... కారణం ఏంటంటే? (ప్రతీకాత్మక చిత్రం)

Uber CEO | ఉబెర్ సీఈఓ డెలివరీ బాయ్‌గా మారారు. ఉబెర్ ఈట్స్ కోసం ఈ అవతారం ఎత్తారు. కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేశారు.

పది ఎకరాల రైతు అయినా తన పొలంలో కూలీగా మారడం నిత్యం జరుగుతూనే ఉంటుంది. కానీ ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ అధినేత తన కంపెనీలోనే చిన్న ఉద్యోగిగా కాసేపైనా ఉండగలరా? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ. కార్పొరేట్ సంస్కృతిలో ఇలా జరగడం దాదాపు అసాధ్యమే. కానీ ఉబెర్ సీఈఓ డారా ఖోస్రోషాహికి మాత్రం ఇందుకు మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే కంపెనీ అత్యున్నత పదవిలో ఉన్న ఆయన.. తాజాగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్‌గా కొన్ని గంటల పాటు కష్టపడ్డారు. అంతేకాకుండా ఈ సమయంలో ఎంత సంపాదించారో కూడా తెలిపారు. డెలివరీ బాయ్ హెల్మెట్ పెట్టుకొని కస్టమర్లకు ఆహారాన్ని డెలివరీ చేసినట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

వీకెండ్ లో డెలివరీ బాయ్‌గా


"కొన్ని గంటల పాటు ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్‌గా మారాను. శాన్ ఫ్రాన్సిస్కో అద్భుతమైన నగరం. రెస్టారెంట్ వర్కర్లు చాలా బాగా మాట్లాడారు. చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆకలిగా ఉంది ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి" అని డారా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా 10 ట్రిప్స్ పూర్తి చేసినందుకు గాను 106.71 డాలర్లు సంపాదించినట్లు స్క్రీన్ షాట్ షేర్ చేశారు. గంటకు 30 డాలర్ల చొప్పున ఆయన సంపాదించారు. ఉబెర్ ఈట్స్ డెలివరీ, మైళ్ల ప్రకారం డబ్బు చెల్లిస్తుంది. వీకెండ్‌లో భాగంగా ఉబెర్ సీఈఓ ఈ డెలివరీ బాయ్ అవతారమెత్తారు.

Realme Narzo 30 5G: తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో రియల్‌మీ నార్జో 30 5జీ సేల్

Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? మీ అకౌంట్ ఖాళీ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ 7 పనులు చేయండి

340 రెట్లు అధికం


స్టాక్స్ కూడా కలుపుకొని 2020లో డారా ఖోస్రోషాహి 12 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకుంటారు. మహమ్మారి ప్రభావంతో బేస్ శాలరీ అయిన ఒక మిలియన్ డాలర్లలో కొంత భాగాన్ని తగ్గించుకున్నారు. డెలివరీ బాయ్ గా సంపాదించిన మొత్తాన్ని.. అతడి వేతనంతో పోల్చినప్పుడు 340 రెట్లుగా ఉంది.

అయితే ఇదే షిఫ్టులో అతడి ప్రయాణాలను తీసివేసి మరో స్క్రీన్ షాట్ ట్విట్టర్లో దర్శనమిచ్చింది. అది 6 గంటల వ్యవధిలో 106.71 డాలర్లుగా ఉందని చూపించింది. దీని ప్రకారం గంటకు ఆయన వేతనం 19 డాలర్లుగా ఉంది. ఈ విషయాన్ని నెటిజన్లు లేవనెత్తారు. ఆయన పని గంటలు జోడించలేదని స్పష్టం చేశారు.

Realme Narzo 30 4G: కాసేపట్లో రియల్‌మీ నార్జో 30 సేల్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Samsung Galaxy M32: కాసేపట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం32 సేల్


వీకెండ్‌లో మరోరోజైన ఆదివారం సాయంత్రం నాడు రెండు గంటల వ్యవధిలో ఆరు ట్రిప్పులు వేశారు. ట్రాఫిక్ కారణంగా మొదటి రోజు మాదిరిగా ఈ రోజు లేదని ఉబెర్ ఈట్స్ సీఈఓ తెలిపారు. అపార్ట్ మెంట్ డ్రాప్ ఆఫ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయని, రెండో రోజు దాదాపు 50 డాలర్లు సంపాదించినట్లు స్క్రీన్ షాట్ పోస్ట్ చేశారు. డెలివరీ చేస్తున్నప్పుడు ఎవరైనా గుర్తించారా అని అడగ్గా.. మాస్క్ వల్ల అదే ప్రయోజనమని రిప్లై ఇచ్చారు.

First published:

Tags: Uber

ఉత్తమ కథలు