వ్యాపారులకు శుభవార్త. యు గ్రో క్యాపిటల్ 'ప్రథమ్' పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. 60 నిమిషాల్లో వ్యాపారులకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు అందించనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 114వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రథమ్ పేరుతో వ్యాపారులకు రుణాలు అందిస్తుండటం విశేషం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల సవరించిన సహ-రుణాల నియమనిబంధనలకు అనుగుణంగా రూపొందించిన కార్యక్రమం ఇది. దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారులు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. కనీసం రూ.50 లక్షల నుంచి రూ.2.5 కోట్ల వరకు రుణాలు లభిస్తాయి. వడ్డీ రేట్లు 8 శాతం నుంచి మొదలవుతాయి. గరిష్టంగా 120 నెలల వరకు టెన్యూర్ ఉంటుంది.
ఆర్బీఐ సవరించిన గైడ్లైన్స్కి అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసి ప్రథమ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వ్యాపార అవసరాలు తీర్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని యు గ్రో క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ శచీంద్ర నాథ్ తెలిపారు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలిచేందుకు యు గ్రో క్యాపిటల్‌తో చేతులు కలిపామని అన్నారు.
ప్రథమ్ ప్రోగ్రామ్‌లో డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది. కేవలం 60 నిమిషాల్లో ఇన్‌ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. హోల్‌సేల్, రీటైల్ ట్రేడర్లు ఈ ప్రోగ్రామ్ ద్వారా రుణాలు పొందొచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పూణె, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 200 పైగా ఛానెల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ వ్యాపారులు ఈ రుణాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.