Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రెగ్యులర్ ఆదాయం పొందొచ్చు.. మార్గాలివే

Fixed Deposits: సంప్రదాయ ఎఫ్‌డీల మాదిరిగా కాకుండా, రెగ్యులర్ ఇన్‌కమ్ పొందే అవకాశం ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మార్గాలు కూడా ఉన్నాయి. అవే ల్యాడరింగ్ టెక్నిక్, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్.

news18-telugu
Updated: October 23, 2020, 10:20 PM IST
Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రెగ్యులర్ ఆదాయం పొందొచ్చు.. మార్గాలివే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పొదుపు చేయడం వల్ల పెద్దగా ఆదాయం రాదు. వాటితో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఎక్కువ. దీంట్లో నష్ట భయం ఉండదు. అందుకే సీనియర్ ఇన్వెస్టర్లు, ఇతర సాంప్రదాయ పెట్టుబడిదారులు వీటిపై ఆసక్తి చూపుతారు. మెచ్యూరిటీ తరువాత ఎఫ్‌డీలపై మంచి రాబడి వస్తుంది. కానీ సంప్రదాయ ఎఫ్‌డీల మాదిరిగా కాకుండా, రెగ్యులర్ ఇన్‌కమ్ పొందే అవకాశం ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మార్గాలు కూడా ఉన్నాయి. అవే ల్యాడరింగ్ టెక్నిక్, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్.

Laddering technique

ఈ విధానంలో పెట్టుబడిదారులు వివిధ బ్యాంకుల్లో వేర్వేరు గడువులతో కొంత మొత్తం(అన్ని బ్యాంకుల్లో ఒకేలా కాకుండా) ఎఫ్‌డీలు లేదా ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి. లిక్విడిటీని మేనేజ్ చేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. దీంతోపాటు వడ్డీ రేట్ల తగ్గుదల, రీ ఇన్వెస్ట్‌మెంట్ వంటి రిస్క్ లకు దూరంగా ఉండవచ్చు. ఉదాహరణకు.. మీవద్ద రూ.3 లక్షలు ఉన్నాయి అనుకుందాం. ఆ డబ్బంతా బ్యాంకులో ఒక సంవత్సరానికి ఎఫ్‌డీ చేయకూడదు. రూ.3 లక్షలను మూడు సమాన భాగాలుగా విభజించి, ప్రతి భాగాన్ని విడిగా, వేర్వేరు గడువులతో, వేర్వేరు బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాలి.

ఒక భాగాన్ని ఒక సంవత్సర కాలానికి, రెండో భాగాన్ని రెండు సంవత్సరాలకు, మూడో భాగాన్ని మూడు సంవత్సరాల మెచ్యూరిటీ గడువు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టాలి. ఎఫ్‌డీలు మెచూరిటీ అవుతున్నప్పుడు వచ్చే డబ్బులో అవసరాలకు పోనూ, మిగతా మొత్తాన్ని ఎక్కువ వడ్డీ అందించే మరొక ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా ఎఫ్‌డీ ఇన్వెస్ట్మెంట్ చైన్ కొనసాగుతుంది. ఈ విధానంలో పెట్టుబడిదారులు భరోసాతో రాబడిని పొందవచ్చు.

NBFCలు అందించే సిస్టమేటిక్ డిపాజిట్ ప్లాన్
బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఒక కొత్త పెట్టుబడి మార్గాన్ని ఇన్వెస్టర్లకు పరిచయం చేసింది. ఈ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్లలో SIP చేసినట్టుగా FDలలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేయవచ్చు. ఇది కార్పొరేట్ సంస్థలు అందించే RD ఇన్‌స్ట్రుమెంట్ లాంటిది. దీంట్లో కనీస డిపాజిట్ రూ.5000 వరకు ఉండాలి. ఈ విధానంలో 12 నుంచి 60 నెలల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే... మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి నెలా, అప్పటికి అమల్లో ఉన్న వడ్డీ రేట్లతో తాజా ఎఫ్‌డీని పొందుతారు. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 7.35 శాతంగా ఉంది. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ప్రతి నెలా, లేదా త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక లేదా క్యుములేటివ్ డిపాజిట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు ఎక్కువ రాబడి లభిస్తుంది.

ఈ కార్పొరేట్ ఎఫ్‌డీలకు CRISIL, ICRA సంస్థలు అధికంగా 'FAAA' రేటింగ్ ను అందిస్తున్నాయి. ఇది మెరుగైన భద్రతను సూచిస్తుంది. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడిదారులు బ్యాంక్ డిపాజిట్లకంటే మెరుగైన వడ్డీ రేట్లను పొందవచ్చు. దీంట్లో వినియోగదారులకు మరింత లబ్ధి చేకూర్చే ఆప్షన్లు ఉన్నాయి. డబ్బు అవసరమైనప్పుడు కస్టమర్లు డిపాజిట్లను కొంతమేరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసిన మూడు నెలల తరువాతే ఇందుకు అవకాశం కల్పించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉన్నందున ఈ పార్షియల్ విత్‌డ్రా ఆప్షన్ ను ఎంచుకోకపోవడమే మంచిది. స్వల్ప, మధ్యస్థ కాలానికి తక్కువ మొత్తంలో డబ్బు కూడబెట్టుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. తక్కువ పన్ను పరిధిలో ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading