భారతీయులకు అతి పెద్ద పండుగ అయిన దీపావళి (Diwali)అతి దగ్గర్లోనే ఉంది. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ టపాసులు, బాణాసంచా పేల్చుతారు. ముఖ్యంగా లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, పెద్ద క్రాకర్స్ తదితర బాణాసంచా (Firecrackers) కాల్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టపాసులను కాల్చడం వల్ల వాతావరణంలో వాయుకాలుష్యం రెట్టింపయ్యే ముప్పు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొందరు ఎకో ఫ్రెండ్లీ ఫైర్‌క్రాకర్స్ వైపు మళ్లుతున్నారు. మరికొందరు ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ (Electronic Firecrackers) కొనుగోలు చేస్తూ పర్యావరణానికి మంచి చేస్తున్నారు. మీరు కూడా ఈ దీపావళిని వీటితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, వీటిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఎందుకంటే అమెజాన్ స్పెషల్ సేల్‌లో వీటిపై మంచి డిస్కౌంట్లు అందిస్తుంది.
ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ ఎలా పనిచేస్తాయి..?
గత కొన్నేళ్లుగా దీపావళి సేల్స్‌లో ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌కి గొప్ప స్పందన లభిస్తోంది. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ అసలైన బాంబుల్లా లైటింగ్ ప్రొడ్యూస్ చేస్తాయి. నిజమైన ఫైర్‌క్రాకర్స్ పేలిస్తే ఎలా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్‌ను వినిపిస్తాయి. నిజమైన బాణసంచాతో పోలిస్తే వీటి సౌండ్, కాంతి తీవ్రత చాలా తక్కువగానే ఉంటుంది. కాకపోతే వీటితో ఎలాంటి ప్రమాదాలు జరగవు. వీటివల్ల ఉత్పన్నమయ్యే ఎయిర్, సౌండ్ పొల్యూషన్ దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. అందుకే వీటిని కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఎక్కువ ఫైర్‌క్రాకర్స్ కాల్చిన అనుభూతి
స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ అనేక ఫైర్‌క్రాకర్ల శబ్దాన్ని ప్లే చేయగలవు. అప్పుడప్పుడు స్పార్క్ అయ్యే అనేక పాడ్స్ వీటిలో ఉంటాయి. ఈ పాడ్స్ అన్ని కలిసి ఫైర్‌క్రాకర్స్ మాదిరిగానే పేలిపోయిన శబ్దాన్ని చేస్తాయి. ఈ పాడ్స్ వైర్ల ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ అయి వస్తాయి. ఈ పాడ్స్‌కి ఎల్‌ఈడీ లైట్లు అమర్చుతారు. ఎలక్ట్రిక్ ఫైర్‌క్రాకర్‌ను ప్లగ్ చేసినప్పుడు ఈ పాడ్స్ ఒరిజినల్ ఫైర్‌క్రాకర్ మాదిరిగానే వెలుగుతాయి. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ కాంతి, ధ్వని, వేగాన్ని రిమోట్ కంట్రోలర్ ద్వారా అడ్జస్ట్ చేయవచ్చు.
అమెజాన్ డిస్కౌంట్స్
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ రూ.2,000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో LED లైట్, రిమోట్‌తో కూడిన A2Z మెటల్ ఎలక్ట్రానిక్ లౌడ్ ఫైర్‌క్రాకర్స్ రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.2,999కే దొరుకుతున్నాయి. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్‌ను కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు. దివాలీ సేల్‌లో వీటి పై స్పెషల్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, BUSINESS NEWS, Diwali