House for Sale: ఇల్లు కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఆ ఇంటి ధర కేవలం రూ.103 మాత్రమే.. ఇలా కొనుగోలు చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ఇళ్లు కొనాలంటే లక్షలు, కోట్లు కావాల్సిన పరిస్థితి. అయితే.. కేవలం రూ. 103కే ఓ ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆ వివరాలు మీ కోసం..

  • Share this:
ఈ రోజుల్లో ఇళ్లు కొనాలన్నా.. కట్టాలన్నా లక్షలు లేదా కోట్లతో కూడుకున్న పని. అయితే  బ్రిటన్‌లోని కేవలం రూ.103కే ఓ ఇల్లు మీ కోసం సిద్ధంగా ఉంది. అయితే ఓ సమస్య ఉంది. దానికి మీరు ఓకే అనుకుంటే వెంటనే కొనేయొచ్చు. ఇంతకీ ఏంటా ఇల్లు కథ, ఎందుకంత తక్కువ ధర, ఆ సమస్య ఏంటో చదివేయండి! వంద రూపాయాలకు ఇంటి ముందు వేసే డస్ట్‌ మ్యాట్‌ కూడా రాదు. అలాంటిది ఏకంగా ఇల్లే అమ్మేస్తారా? అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ ఇది నిజం. వేల్స్‌లోని ఓ రెండు గదుల ఇంటిని 103 రూపాయలకు అమ్మేయాలని ఓనర్లు నిర్ణయించారు. దీన్ని వెబ్‌సైట్‌లో వేలానికి కూడా పెట్టేశారు. 103 రూపాయలు అని మనం కొంచెం గొప్పగా చెప్పుకున్నా.. అక్కడి కరెన్సీ ప్రకారం ఇది ఒక యూరో మాత్రమే. అంత తక్కువకు ఇస్తున్నారు కదా అదేమన్నా మారుమూల ఊరులోనా అనే అనుమానం కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇల్లు మోరిస్టన్‌ అనే ప్రధాన పట్టణ ప్రాంతంలోనే ఉంది. ఇంకేముంది కొనేయొచ్చు అనుకోవచ్చు. అయితే ఈ ఇంటిని తీసుకున్నాక దానికి చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వంటగది, బాత్‌రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలి.
IOB Mega E-Auction: తక్కువ ధరకు ఇళ్లు, ఇతర ప్రాపర్టీలు.. ఎల్లుండే ఈ-వేలం.. వివరాలివే

రెండు ఫ్లోర్లలో ఉన్న ఈ ఇంటిని చాలా కాంపాక్ట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఒక రూమ్‌లో ఫైర్‌ ప్లేస్‌ పెట్టుకున్నారు. దాని పక్కనే మెట్లు ఉన్నాయి. దానికి దిగువన ఒద్దికగా కప్‌బోర్డు ఉంటుంది. పై ఫ్లోర్‌లో కూడా ఒక గది ఉంటుంది. ఆ పైన పెద్ద టెర్రస్‌ ఉంది. ఇంటి పక్కన చిన్న ప్లేస్‌ కూడా ఉంది. దానిని అవసరానికి తగ్గట్టుగా మార్చుకుని ఇంటి గదులను పెద్దగా చేసుకోవచ్చు.

వేలంలో ఇంటి ధరను ప్రాథమికంగా రూ.103 రూపాయలుగా నిర్ణయించారు. మరి వేలంలో దీని ధర ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. ఇల్లు ఇప్పుడు చూడటానికి చిన్నగా ఉన్నా, పక్కనున్న ప్లేస్‌ కలుపుకుంటే పెద్ద ఇల్లు అవుతుందని వేలానికి పెట్టిన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు మరింత మోడర్న్‌గా తయారు చేసుకునే అవకాశమూ ఉంది.

సౌత్‌ వేల్స్‌లో భూములు, ఇళ్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ ఇంటిని తీసుకున్నవాళ్లు చక్కగా ఆధునీకరించి వాడుకోవచ్చు. అందుకే వేలంగా ఎవరు ఈ ఇంటిని చేజిక్కుంచుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా తక్కువ ధరలకు ఇల్లు అమ్మకానికి పెట్టడం కొత్త కాదు.

గతేడాది సినిక్యూఫ్రాండీలో ఇలాగే ఒక ఇటాలియన్‌ ఇంటిని ఒక యూరోకు అమ్మారు. అయితే అది గ్రామీణ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఉన్న యువత ఉద్యోగం కోసం గ్రామాలు వదిలి వెళ్లిపోవడంతో... అలా తక్కువకే అమ్మాల్సి వచ్చింది. అయితే ఈ ఇంటిని ఎందుకు ఒక్క యూరో ధరకు అమ్మేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఇంటికి వేలం 21,500 యూరోలకు చేరింది.
Published by:Nikhil Kumar S
First published: