Twitter Blue: సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రవేశపెట్టిన ట్విట్టర్.. కొత్త ఫీచర్లకు నెలకు రూ.270 వరకు ఖర్చు..

ట్విట్టర్ లోగో

సబ్‌స్క్రిప్షన్‌ సేవలను ప్రారంభించేందుకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. "ట్విట్టర్ బ్లూ" పేరుతో రానున్న ప్లాట్‌పాంలో సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీగా నెలకు 2.99 డాలర్లను సంస్థ వసూలు చేయనుంది.

  • Share this:
సబ్‌స్క్రిప్షన్‌ సేవలను ప్రారంభించేందుకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. "ట్విట్టర్ బ్లూ" పేరుతో రానున్న ప్లాట్‌పాంలో సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీగా నెలకు 2.99 డాలర్లను సంస్థ వసూలు చేయనుంది. ఈ సేవల గురించి ట్విట్టర్ అనుకోకుండా నిర్ధారించింది. ట్విట్టర్ యాప్ స్టోర్‌ లిస్టింగ్‌లో.. ట్విట్టర్ బ్లూ ఇన్-యాప్ పర్చేజింగ్‌ను జోడించినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఇది అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. సబ్‌స్క్రిప్షన్ సేవలను ముందు అమెరికాలో ప్రారంభించనున్నారు. భారత్‌లో దీనికి రూ.200 నుంచి రూ.270 వరకు వసూలు చేసే అవకాశం ఉంది.

సెక్యూరిటీ రిసెర్చర్ జేన్ మంచూన్ వాంగ్ ఈ కొత్త అప్‌డేట్‌ను ముందుగా గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. “ట్విట్టర్ యాజమాన్యం ట్విట్టర్ బ్లూను విడుదల చేయనుంది. యాప్ స్టోర్‌లో ఇన్‌-యాప్ పర్చేజ్‌గా దీన్ని యాడ్ చేశారు. ఈ సేవలను వినియోగించుకునేందుకు నెలకు 2.99 డాలర్లు ఖర్చు అవుతుంది. దీన్ని టెస్ట్ చేసిన మొదటి ట్విట్టర్ బ్లూ కస్టమర్‌ని నేనే. ట్విట్టర్ బ్లూ కలర్ థీమ్స్‌తో పాటు కస్టమ్ యాప్ ఐకాన్స్‌తో వస్తుంది. రీడర్ మోడ్ త్వరలో వస్తుంది ” అని వాంగ్ వివరించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ని కూడా వాంగ్ షేర్ చేశారు.

ట్విట్టర్ బ్లూలో వినియోగదారులు యాప్ ఐకాన్‌ రంగును మార్చుకోవచ్చు. మెనులో వివిధ కలర్‌ ఆప్షన్లు ఉంటాయి. దీంతోపాటు యూజర్లు కలర్ థీమ్‌ను బ్లూ నుంచి పింక్, గ్రీన్, రెడ్, ఎల్లో, ఆరెంజ్.. వంటి రంగులకు మార్చుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ సేవల్లో “undo tweet”; “reader mode” ఆప్షన్‌లను ట్విట్టర్ ప్రవేశపెట్టనుంది. అన్‌డూ ట్వీట్ ఫీచర్ కోసం యూజర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. రీడర్ మోడ్ ద్వారా వినియోగదారులు లాంగ్ థ్రెడ్స్‌ను సులభంగా చదివే వీలుంటుంది.

ఈ ఫీచర్లను వాడుకునేందుకు నెలవారీగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ బ్లూ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌కు 2.99 డాలర్లు ఖర్చు అవుతుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ కూడా భారత్‌లో ఇన్ యాప్ పర్చేజ్‌ను చూసినట్లు ధ్రువీకరించారు. ఈ సర్వీసులకు రూ.269 ఖర్చు అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. యూజర్లు యాడ్స్ లేకుండా న్యూస్ కంటెంట్‌ను చూసే వీలు కల్పించే కొత్త స్టార్టప్‌ను ట్విట్టర్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ సేవల్లో మరిన్ని కొత్త ఫీచర్లను ట్విట్టర్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీనిపై ట్విట్టర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Published by:Krishna Adithya
First published: