హోమ్ /వార్తలు /బిజినెస్ /

Elon Musk Twitter Deal: ఇక ఎలాన్ మస్క్‌ పప్పులుడకవ్.. ట్విట్టర్ డీల్‌లో ట్విస్ట్!

Elon Musk Twitter Deal: ఇక ఎలాన్ మస్క్‌ పప్పులుడకవ్.. ట్విట్టర్ డీల్‌లో ట్విస్ట్!

Elon Musk

Elon Musk

Twitter | ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్‌లో ముఖ్యమైన ఘటన చోటుచేసుకుంది. ట్విట్టర్ షేర్ హోల్డర్లు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్‌కు ఆమోదం తెలిపారు. తాజాగా జరిగిన షేర్ హోల్డర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Elon Musk Twitter Buying | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలీదు. ఇటీవల ట్విట్టర్ (Twitter) డీల్‌తో టాక్ ఆఫ్ వరల్డ్‌గా నిలిచారు. ఒకసారేమో కొంటానంటాడు.. మరోసారేమో లేదు కొనను అని చెబుతాడు. ఇలా ఈయన ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ డీల్ తెర మీదకు వచ్చింది. ట్విట్టర్ సంస్థ వాటాదారులు ఎలాన్ మస్క్ డీల్‌కు ఆమోదం తెలిపారు. ఎలాన్ మస్క్ ఆఫర్ చేసిన 44 బిలియన్ డాలర్ల కొనుగోలుకు అంగీకారం చెప్పారు. తాజాగా జరిగిన వాటాదారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది ఆన్‌లైన్‌లో ఓటింగ్ వేశారు. దీంతో ట్విట్టర్ ఇక ప్రైవేట్ కంపెనీగా మారిపోనుంది.

  ట్విట్టర్ ఫేక్ అకౌంట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తోందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ట్విట్టర్ షేర్ హోల్డర్లు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్‌కు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొనలేనని వెనక్కి జారుకోవడంతో ట్విట్టర్.. ఎలాన్ మస్క్‌ మీద ట్విట్టర్ దావా వేసిన విషయం తెలిసిందే. డీల్ పూర్తి చేయాల్సిందేనని ట్విట్టర్ పేర్కొంటోంది. దీనిపై అక్టోబర్‌లో విచారణ జరగనుంది.

  పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారికి కేంద్రం తీపికబురు?

  ఇప్పుడు ట్విట్టర్ షేర్ హోల్డర్లు తీసుకున్న తాజా నిర్ణయం అనేది ఎలాన్ మస్క్ డీల్‌ను పూర్తి చేయడానికి ఉద్దేశించిన వ్యాజ్యాన్ని కొనసాగించడానికి ట్విట్టర్‌కు అనుమతినిస్తుంది. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో వచ్చే నెలలో ఈ డీల్ అంశంపై ట్రయల్‌ ప్రారంభం అవుతుంది. స్పామ్, బోట్ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి సంఖ్యను ట్విట్టర్ తక్కువ చేసి చూపిస్తోందనే ఆరోపణతో పాటు ట్విట్టర్ మాజీ సెక్యూరిటీ హెడ్ పీటర్ ముడ్జ్ జాట్కో వెల్లడించిన వివరాలతో సహా ట్విట్టర్ తన అంతర్గత కార్యకలాపాల గురించి ముఖ్యమైన వాస్తవాలను దాచిపెట్టిందని మస్క్ వాదించడానికి సిద్ధంగా ఉన్నారు.

  గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

  అదేసమయంలో ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు కేవలం వెనక్కు తగ్గడానికి ఒక సాకు మాత్రమేనని ట్విట్టర్ చెబుతూ వస్తోంది. కుంటిసాకులు చెబుతూ ఒప్పందం నుంచి ఎలాన్ మస్క్ తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. ఏదేమైనా ఈ డీల్‌లో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎలాన్ మస్క్ అంత ఈజీ వ్యక్తి మాత్రం కాదు. అలానే ట్విట్టర్ కూడా ఈ డీల్‌పై చాలా ఫోకస్డ్‌గా ముందుకు వెళ్తోంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Elon Musk, Twitter

  ఉత్తమ కథలు