TWITTER INDIA MD MANISH MAHESHWARI NAMED IN FIR OVER DISTORTED INDIA MAP MK GH
Twitter Controversy: ట్విట్టర్ ఇండియా ఎండీపై పోలీసు కేసు నమోదు
ప్రతీకాత్మకచిత్రం
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్.. ఇండియాలో వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సంస్థ తాజాగా ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించి మరోసారి రచ్చకెక్కింది. దీనిపై వివరణ అడగడానికి కేంద్రపభుత్వం సిద్ధమవుతున్న తరుణంలోనే ఉత్తరప్రదేశ్‌లో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై పోలీసు కేసు నమోదైంది.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్.. ఇండియాలో వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సంస్థ తాజాగా ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించి మరోసారి రచ్చకెక్కింది. దీనిపై వివరణ అడగడానికి కేంద్రపభుత్వం సిద్ధమవుతున్న తరుణంలోనే ఉత్తరప్రదేశ్‌లో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై పోలీసు కేసు నమోదైంది. ట్విట్టర్ తన ట్వీప్లైఫ్ విభాగంలో చూపిన ప్రపంచపటంలో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను భారతదేశం సరిహద్దుకు ఆవల, ప్రత్యేక దేశంగా ఉన్నట్టు చూపడంతో వివాదం రేగింది. దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ సంఘటన భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ పశ్చిమ విభాగం భజరంగ్‌దళ్ ఆఫీసు బేరర్ ప్రవీణ్ భాటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ జిల్లాలోని కుర్జా పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
‘ట్విట్టర్ ప్రచురించిన ప్రపంచపటంలో లద్దాఖ్, జమ్మూ కశ్మీర్‌లను భారతదేశంలో అంతర్భాగంగా చూపించలేదు. ఇదేమీ అనుకోకుండా జరిగిన సంఘటనకాదు. ఇది నాతోసహా భారతీయులందరి మనోభావాలను దెబ్బతీసింది’ అని భజరంగ్ దళ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ విభాగం కన్వీనర్ ప్రవీణ్ భాటీ తన ఫిర్యాదులో పేర్కొన్నారని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది. ఈ ఎఫ్ఐఆర్లో ట్విట్టర్ న్యూస్ పార్ట్నర్షిప్ హెడ్ అమృతా త్రిపాఠిని కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. మహేశ్వరి, త్రిపాఠిలపై ఐపీసీ సెక్షన్ 505 (2) , ఐటీ చట్టం 74 కింద కేసు నమోదు చేశారు.
ఇక ట్విట్టర్ తప్పుగా చూపిన మ్యాప్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ట్విట్టర్‌ను సంజాయిషీ కోరుతూ త్వరలోనే ప్రభుత్వం నోటీసులు జారీ చేయనుందని ఐటీ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. తప్పుగా చూపిన మ్యాప్‌పై కామెంట్ చేయాల్సిందిగా పంపిన ఈ మెయిల్‌పై ట్విట్టర్ నుంచి ఈ వార్త ప్రచురితమయ్యే సమయానికి ఎటువంటి స్పందనా రాలేదు. అయితే భారతదేశంలో ట్విట్టర్‌కు ఇకపై ఇంటర్మీడియరీ (మధ్యవర్తి) హోదా లేదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 79 కింద ఇంటర్నెట్ ఇంటర్మీడియర్స్కు కల్పించే రక్షణను ట్విట్టర్‌కు కల్పించలేమని అధికారులు తేల్చిచెప్పారు.
భారతదేశ అధికారిక మ్యాప్‌ను ట్విట్టర్ ఇలా తప్పుగా చూపడం ఇది మూడోసారి. కిందటేడాది అక్టోబరు, నవంబరు మాసాలలో ట్విట్టర్ ఆటోమేటిక్ జియో టాగింగ్ ఫీచర్ లేహ్‌లోని యుద్ధస్మారక స్థూపం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేటప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా కింద చూపించింది. తదుపరి ట్విట్టర్ ఈ విషయమై క్షమాపణ తెలిపింది. కానీ తరువాత లేహ్ ప్రాంతం లద్దాఖ్‌లో భాగంగా చూపించాల్సింది పోయి జమ్మూ కాశ్మీర్లో భాగంగా చూపింది. తాజా వివాదంపైనా ట్విట్టర్ వెంటనే స్పందించి మ్యాప్‌ను తొలగించినప్పటికీ ప్రభుత్వానికి ఎటువంటి వివరణ ఇస్తుందో, ఈ కేసులను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.