TikTok కొనుగోలు రేసులో నిలిచిన Twitter...మైక్రోసాఫ్ట్ కు గట్టిపోటీ...

తాజాగా ఈ రేసులోకి ట్విట్టర్ కూడా చేరింది. TikTokను స్వాధీనం చేసుకోవడానికి ట్విట్టర్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: August 9, 2020, 8:52 PM IST
TikTok కొనుగోలు రేసులో నిలిచిన Twitter...మైక్రోసాఫ్ట్ కు గట్టిపోటీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TikTok యాప్ ను కొనుగోలు చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ రేసులోకి ట్విట్టర్ కూడా చేరింది. TikTokను స్వాధీనం చేసుకోవడానికి ట్విట్టర్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ TikTokను కొనుగోలు చేయాలనుకుంది. కానీ ఇప్పుడు Twitter కూడా బైట్ డాన్స్ తో చర్చలు ప్రారంభించినట్లు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ బిడ్‌కు ప్రత్యర్థిగా ఉండటానికి ట్విట్టర్ తగినంత ఆర్ధిక దన్ను లేదనే ట్రేడ్ వర్గాల అంచనాగా ఉంది. అయితే వివాదాస్పద సోషల్ మీడియా యాప్‌ TikTokను సొంతం చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ముందంజలో నిలిచింది.

బైట్ డాన్స్ అత్యంత ప్రజాదరణ పొందిన TikTok ద్వారా గడిచిన రెండు సంవత్సరాల్లో భారీ వృద్ధిని సాధించింది, ఎందుకంటే ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. ఏదేమైనా, గత కొన్ని నెలలుగా పరిస్థితులు టిక్‌టాక్‌కు గందరగోళంగా మారాయి - జూన్ చివరలో, టిక్‌టాక్ యొక్క అతిపెద్ద విదేశీ మార్కెట్ అయిన భారతదేశంలో బ్యాన్ కు గురవ్వడంతో పాటు ఇప్పుడు యుఎస్ఎలో సెప్టెంబర్ 15 తర్వాత వేటు పడేందుకు సిద్ధంగా మారింది. ఈ నేపథ్యంలో బైట్ డ్యాన్స్ కంపెనీ టిక్ టాక్ యుఎస్ కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించవచ్చని లేదా మరొక ప్రధాన మార్కెట్లో కలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Published by: Krishna Adithya
First published: August 9, 2020, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading