హోమ్ /వార్తలు /బిజినెస్ /

Twitter Twist : ఓ మై గాడ్.. ట్విట్టర్‌లో యేసు ప్రభువుకు బ్లూ టిక్..

Twitter Twist : ఓ మై గాడ్.. ట్విట్టర్‌లో యేసు ప్రభువుకు బ్లూ టిక్..

అలా ఎలా (image credit - twitter - Jesus)

అలా ఎలా (image credit - twitter - Jesus)

Twitter : ప్రస్తుతం ట్విట్టర్.. ట్రెండింగ్‌లో ఉంది. ఈమధ్యే దాన్ని సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. పూర్తిగా కమర్షియల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్లూ టిక్‌కి మనీ వసూలు చేయాలనే నిర్ణయం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో యేసు ప్రభువుకు బ్లూ టిక్ ఇవ్వడం.. వైరల్ అయ్యింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Twitter Twist : ట్విట్టర్‌లో ఏం జరుగుతోంది అని నెటిజన్లు సెటైరికల్‌గా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎవరికైనా బ్లూ టిక్ (BlueTick) ఇస్తే.. ఆ అకౌంట్‌ని పూర్తిగా వెరిఫై చేశారనీ, అకౌంట్ కలిగిన వ్యక్తి నిజమైన వారే అని అర్థం. కానీ ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లకు కూడా బ్లూ టిక్ ఇచ్చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈమధ్యే ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ (Elon Musk).. ప్రమాణాలను గాలికి వదిలేశారా అనే డౌట్ వస్తోంది నెటిజన్లకు. ఇందుకు ప్రధాన కారణం జీసస్ క్రైస్ట్ (Jesus Christ) అనే అకౌంట్‌కి బ్లూటిక్ ఇవ్వడమే,

ట్విట్టర్‌లో బ్లూటిక్ ఇవ్వాలంటే.. నెలకు $7.99 ఇవ్వాలని ఎలన్ మస్క్ కండీషన్ పెట్టారు. ఆ మనీ ఇవ్వడం వల్లే జీసస్ క్రైస్ట్ అకౌంట్‌కి బ్లూటిక్ ఇచ్చేశారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు ఆమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుమీద ఉన్న అకౌంట్‌కి కూడా ఇప్పుడు బ్లూటిక్ వచ్చింది. నిజానికి ఎలన్ మస్క్ కంటే ముందు.. డొనాల్డ్ ట్రంప్‌పై లైఫ్ టైమ్ బ్యాన్ ఉంది. మరి ఎలన్ మస్క్ రాగానే.. నకిలీ అకౌంట్‌కి బ్లూటిక్ ఎలా ఇచ్చారనే ప్రశ్న వేస్తున్నారు నెటిజన్లు.

డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌కి బ్లూటిక్ ఇవ్వడం వల్ల.. అది నిజమైన అకౌంట్ అనే అర్థం వస్తోంది. కానీ నిజం ఏంటంటే.. అది నిజమైన ట్రంప్ అకౌంట్ కాదు. దీనిపై దుమారం రేగడంతో.. కొన్ని గంటల తర్వాత ఈ అకౌంట్‌ని తొలగించింది ట్విట్టర్ .

ఇవి మాత్రమే కాదు. చాలా నకిలీ అకౌంట్లకు ట్విట్టర్‌లో బ్లూ టిక్స్ కనిపిస్తున్నాయి. సూపర్ మేరియో, బాస్కెట్ బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ వంటి వారికి బ్లూటిక్స్ ఇచ్చారు. తర్వాత వెరిఫై చేసి బ్లూటిక్ తొలగించారు. కానీ జీసస్ క్రైస్ట్‌కి మాత్రం ఇంకా బ్లూటిక్ అలాగే ఉంది.

Viral Video : ఓరిదేవుడో.. ఇంటిపై పడిన ఉల్క.. కొంప ముంచిందిగా..

అసలు ఫేక్ అకౌంట్లకు బ్లూటిక్ ఇస్తున్నప్పుడు.. ఇక ఆ టిక్‌ వల్ల ప్రయోజనం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మనీ తీసుకొని.. ఇష్టమొచ్చినట్లు టిక్స్ ఇచ్చేస్తారా అని నిలదీస్తున్నారు. ఎలన్ మస్క్ సారధ్యంలో ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ట్విట్టర్‌పై ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని అంటున్నారు.

First published:

Tags: BUSINESS NEWS, Twitter

ఉత్తమ కథలు