Home /News /business /

TWITTER CTO PARAG AGRAWAL WILL REPLACE JACK DORSEY AS CEO MK

Twitter CEO Jack Dorsey | ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీ గుడ్‌బై...కొత్త సీఈఓగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియామకం..

 ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీ గుడ్‌బై...కొత్త సీఈఓగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియామకం..

ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీ గుడ్‌బై...కొత్త సీఈఓగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియామకం..

Twitter CEO Jack Dorsey | Parag Agrawal Twitter New CEO: మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ సీఈవో పదవి నుంచి జాక్ డోర్సీ వైదొలగగా, నూత‌న సీఈవోగా కంపెనీ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ప‌రాగ్ అగ‌ర్వాల్ నియ‌మితుల‌య్యారు.

    Twitter CEO Jack Dorsey | Parag Agrawal Twitter New CEO: మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ సీఈవో పదవి నుంచి జాక్ డోర్సీ వైదొలగగా, నూత‌న సీఈవోగా కంపెనీ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ప‌రాగ్ అగ‌ర్వాల్ నియ‌మితుల‌య్యారు. ఇదిలా ఉంటే గ‌త సంవత్సరం నుంచే డోర్సీని సీఈవోగా వైదొలిగే అవకాశం ఉందని ట్విట్ట‌ర్ బోర్డు సిద్ధ పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేశారు. అతని స్థానంలో పరాగ్ అగర్వాల్‌ను (Who is Parag Agrawal) తీసుకోనున్నారు. జాక్ డోర్సే తన వారసుడు పరాగ్‌కు కంపెనీ కమాండ్‌ను అప్పగించనున్నారు. ట్విట్టర్ తన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు గత ఏడాదిలో అనేక ఆవిష్కరణలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. ఫేస్‌బుక్ , టిక్‌టాక్ వంటి ప్రత్యర్థులతో మార్కెట్లో ఉండటానికి , 2023 నాటికి దాని వార్షిక ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడానికి ట్విట్టర్ అనేక కొత్త చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే ట్విట్టర్ ద్వారా ఒక లేఖ విడుదలైంది. అందులో డోర్సీ.. కంపెనీలో ఎన్నో పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. మొదట సహ వ్యవస్థాపకుడు నుండి CEO పాత్రను పోషించానని, ఆ తర్వాత చైర్మన్ పదవిని చేపట్టారు. దీని తర్వాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అప్పటి నుంచి 16 ఏళ్లపాటు సీఈఎఓగా పనిచేశారు. అయితే ఇప్పుడు కంపెనీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాను. కాబట్టి నా వారసుడు అంటే పరాగ్ అగర్వాల్ ఇప్పుడు మా కొత్త CEO అవుతాడు. అన పేర్కొన్నాడు.



    ట్విట్ట‌ర్ సీఈవోగా డోర్సీ వైదొలుగుతార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో సంస్థ స్క్రిప్ట్ ప్రారంభంలో 11 శాతం పెరిగింది. డోర్సీ సార‌ధ్యంలోని డిజిట‌ల్ పేమెంట్స్ సంస్థ స్క్వేర్ ఇంక్ మూడు శాతం పెరిగింది. ఆదివారం చివ‌రిగా జాక్ డోర్సీ చేసిన ట్విట్‌లో.. నేను ట్విట్ట‌ర్‌ను ప్రేమిస్తాను అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను సోమ‌వారం 54 వేల మందికి పైగా లైక్ చేశారు. జాక్ డోర్సీ వైదొల‌గ‌నున్నార‌న్న వార్త‌ను ప్ర‌ముఖ చానెల్ సీఎన్బీసీ రిపోర్ట్ చేసింది.

    Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

    గ‌తేడాది ప్రారంభంలో ఎల్లియ‌ట్ మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి జాక్ డోర్సీని తొల‌గించాల‌న్న డిమాండ్ బ‌లంగా వినిపించింది. ట్విట్ట‌ర్‌ను ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఎల్లియ‌ట్ మేనేజ్మెంట్ గ్రూప్ వాద‌న‌. పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ స్క్వేర్ ఇంక్‌ను ట్విట్ట‌ర్ నిర్వ‌హిస్తున్న‌ద‌ని ఆరోపించింది. ఆయ‌న రాజీనామా త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంద‌ని, ఇక నుంచి డైరెక్ట‌ర్‌గా 2022 వ‌ర‌కు కొన‌సాగుతార‌ని ట్విట్ట‌ర్ వ‌ర్గాలు తెలిపాయి. తానూ ట్విట్ట‌ర్ సీఈవోగా వైదొలుగుతున్న‌ట్లు జాక్ డోర్సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

    Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Twitter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు