ఇండియన్ టూవీలర్(Two Wheeler) మార్కెట్‌లో ప్రస్తుతం స్కూటర్ల హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం ప్రీమియం బైక్స్‌పైనే(Premium Bikes) దృష్టిపెట్టిన రైడర్లు(Riders).. ప్రస్తుతం టాప్ ఫీచర్లతో వస్తున్న ప్రీమియం స్కూటర్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. తాజాగా టీవీఎస్ మోటార్(TVS Motors) కంపెనీ లక్ష రూపాయల రేంజ్‌లో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. తమ బ్రాండ్(Brand) నుంచి వచ్చిన ప్రముఖ స్పోర్టీ 125cc గేర్‌లెస్ స్కూటర్ NTorqలో కొత్త వేరియంట్‌ను(Varient) కంపెనీ తాజాగా విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టీ (TVS NTorq 125 XT) పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.
ఇండియాలో TVS NTorq 125 XT స్కూటర్ ధరను రూ. 1.03 లక్షలుగా నిర్దేశించారు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఈ స్కూటర్.. కంపెనీ నుంచి వచ్చిన NTorq లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ వేరియంట్. ఈ స్కూటర్ టాపింగ్ వెర్షన్ క్లాస్-లీడింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది క్రికెట్ స్కోర్, సోషల్ మీడియా నోటిఫికేషన్లను కూడా చూపిస్తుంది. TVS NTorq 125 స్కూటర్ అత్యాధునిక ఫీచర్లతో రిలీజ్ అయింది. అయితే కొత్త XT వేరియంట్.. ప్రతి ఫీచర్‌లో కొత్త అప్‌డేట్‌ను అందిస్తుంది. ఇది కలర్డ్ TFT, LCD ప్యానెల్‌తో సెగ్మెంట్-ఫస్ట్ హైబ్రిడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. NTorq 125 లైనప్.. TVS అభివృద్ధి చేసిన SmartXonnect బ్లూటూత్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ కొత్త వేరియంట్‌లో SmartXtalk పేరుతో అధునాతన వాయిస్ అసిస్ట్‌ను కూడా అందిస్తున్నారు.
ఈ స్కూటర్ TFT కన్సోల్ కస్టమర్లను ఆకర్షించనుంది. టాప్ రేంజ్ XT వేరియంట్‌లో స్మార్ట్‌ఎక్స్‌ట్రాక్ ఫీచర్ ఉంది. ఇది రైడర్లకు సోషల్ మీడియా నోటిఫికేషన్లు, కాల్ & SMS అలర్ట్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్టేటస్.. వంటివి చూపిస్తుంది. రైడర్లకు ఇష్టం వచ్చినప్పుడు క్రికెట్, ఫుట్‌బాల్ స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు. ట్రాక్ లైవ్ AQI ఫీచర్ అదనపు ఆకర్షణ. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడి వెయిట్ చేస్తున్నప్పుడు స్కూటర్ కన్సోల్‌లో వార్తలు, మరిన్నింటిని చదువుకోవచ్చు.
మెకానికల్స్ పరంగా చూస్తే.. NTorq XT కూడా స్టాండర్డ్ వేరియంట్ల మాదిరిగానే ఉంటుంది. ఇది RT-Fi (రేస్ ట్యూన్డ్ ఫ్యూయెల్-ఇంజెక్షన్) టెక్నాలజీతో కూడిన 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్ 9.2 hp పవర్‌ను, 10.5 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేయగలదు. దీని ధర రూ. 1.03 లక్షలు. కొత్త TVS NTorq 125 XT వేరియంట్ ధర.. NTorq రేస్ XP వెర్షన్ ధర కంటే రూ. 14,000 ఎక్కువ. లేటెస్ట్ ఫీచర్లతో వచ్చింది కాబట్టి, ఆ మేరకు ధరను కంపెనీ పెంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Tvs, Two wheelers