TVS Ntorq 125: టీవీఎస్​ Ntorq 125 స్కూటర్​పై బంపర్ ఆఫర్​​.. అప్పటివరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం

TVS Ntorq 125 Race Edition. (Photo: TVS)

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ తన పాపులర్​ మోడల్​పై అదిరిపోయే ఆఫర్​ ప్రకటించింది.

  • Share this:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ తన పాపులర్​ మోడల్​పై అదిరిపోయే ఆఫర్​ ప్రకటించింది. టీవీఎస్​ Ntorq 125 స్కూటర్​ కొనుగోలు చేసే వారి కోసం నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్​ను అందుబాటులోకి తెచ్చింది. నో కాస్ట్​ ఈఎంఐ స్కీమ్​ ఎంచుకునే కస్టమర్లు ఎటువంటి అదనపు వడ్డీ లేకుండానే సులభతర వాయిదాల్లో స్కూటర్​ను​ సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు, షరతులు విధించింది టీవీఎస్​ సంస్థ. ఈ ఆఫర్​ కేవలం ఆన్​లైన్​ ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే లభిస్తుందని పేర్కొంది. అంతేకాక, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలకు మాత్రమే నో కాస్ట్​ ఈఎంఐ ఫెసిలిటీ వర్తిస్తుందని తెలిపింది.

తొలుత జూన్​ 15 వరకు మాత్రమే ఈ ఆఫర్​ అందుబాటులో ఉండేది. అయితే, ఎక్కువ మంది కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో దీన్ని జూన్​ 30 వరకు పొడిగించింది. ఈ ఆఫర్​ కేవలం మూడు నెలలు, 6 నెలల ఈఎంఐ ఆప్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సమీపంలోని టీవీఎస్ డీలర్‌షిప్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. కొన్ని డీలర్​షిప్​ సెంటర్లు అదనపు డిస్కౌంట్​ కూడా అందిస్తున్నాయి. తర్వారా నో కాస్ట్​ ఈఎంఐతో పాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాలకు టీవీఎస్​ మోటార్స్​ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాలని టీవీఎస్​ వినియోగదారులను కోరింది. అన్ని ఆఫర్​ వివరాలను వెబ్​సైట్​లో పొందుపర్చింది.

జూన్​ 30 వరకు ఆఫర్​ చెల్లుబాటు..
టీవీఎస్​ Ntorq 125 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 124.8 సిసి, థ్రీ -వాల్వ్, సింగిల్ సిలిండర్, ఫ్యుయల్​ -ఇంజెక్ట్ ఇంజిన్​తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్​ 9.4 హెచ్‌పి, 10.5 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ Ntorq 125లో బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంజిన్ కిల్ స్విచ్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించింది. ఈ స్కూటర్ రేస్ ఎడిషన్ ఆల్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌తో పాటు స్పోర్టీ లుకింగ్ గ్రాఫిక్స్​తో వస్తుంది. టీవీఎస్ Ntorq 125 ప్రస్తుతం డ్రమ్, డిస్క్, రేస్​, సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ నాలుగు వేరియంట్లు దేశంలోని అన్ని టీవీఎస్​ డీలర్​షిప్​ సెంటర్లలో అందుబాటులో ఉంటాయి.

ధర విషయానికి వస్తే.. దీని సూపర్ స్క్వాడ్ ఎడిషన్ రూ .81,075 ధర వద్ద లభిస్తుంది. డ్రమ్ వేరియంట్‌ ధర రూ .71,095 వద్ద ప్రారంభమవుతుంది. కాగా, టీవీఎస్ Ntorq 125 మోడల్ అంతర్జాతీయ మార్కెట్​లో చాలా తక్కువ కాలంలోనే లక్ష యూనిట్ల అమ్మకాలు సాధించి రికార్డు సృష్టించింది.
Published by:Sumanth Kanukula
First published: