TVS Jupiter 125: టీవీఎస్​ జూపిటర్​ 125 లాంచ్​.. అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

TVS Jupiter 125: దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కొత్త స్కూటర్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. కొత్త జూపిటర్​ 125 మోడల్​ను ఆవిష్కరించింది.  ఇప్పటివరకు 110 సీసీ వరకే పరిమితమైన ఈ మోడల్​ను 125 సిసి కి అప్‌డేట్ చేసింది.

  • Share this:
దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motors) కొత్త స్కూటర్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. కొత్త జూపిటర్​ 125 (Jupiter 125) మోడల్​ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు 110 సీసీ వరకే పరిమితమైన ఈ మోడల్​ను 125 సిసి కి అప్‌డేట్ చేసింది. దీని ద్వారా ఈ సెగ్మెంట్​లో ప్రత్యర్థిగా ఉన్న హోండా యాక్టివా (Honda Activa) 125సీసీ, సుజుకి (Suzuki) యాక్సెస్​ 125 సీసీ టూవీలర్స్​కు గట్టిపోటీనివ్వనుంది. దీంట్లో అనేక అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది. రెండు హెల్మెట్లు భద్రపర్చుకునేంత సీట్​ స్పేస్​తో ఈ స్కూటర్​ను డిజైన్​ చేయడం ప్రత్యేకత.

సరికొత్త టీవీఎస్​ జూపిటర్​ 125 డ్రమ్​, డ్రమ్​ అలాయ్​, డిస్క్​ వేరియంట్లలో లభిస్తుంది. ఇది డాన్​ ఆరెంజ్​, ఇండిబ్లూ, ప్రిస్టిన్​ వైట్​, టైటానియం, గ్రే కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మోడల్​ లాంచింగ్​పై టీవీఎస్​ మోటార్​ డైరెక్టర్​, సీఈఓ కేఎన్​ రాధాకృష్ణన్​ మాట్లాడుతూ ‘‘కొత్త టీవీఎస్​ జూపిటర్​ 125సీసీ మోడల్​లో న్యూ స్టయిలింగ్​, న్యూ ప్లాట్​ఫామ్​, సెగ్మెంట్​ ఫస్ట్​ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 2013 లో టీవీఎస్​ జూపిటర్​ ప్రారంభమైనప్పటి నుంచి మంచి అమ్మకాలు నమోదు చేసింది. దేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో ఇది ఒకటిగా నిలిచింది. అందుకే దీన్ని 125 సీసీకి అప్​గ్రేడ్​ చేస్తూ కొత్త వేరియంట్​ను విడుదల చేస్తున్నాం. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీన్ని రూపొందించాం.” అని చెప్పారు.

Amazon TV Stick: అమెజాన్ ఫైర్ స్టిక్ 4K మాక్స్ లాంచ్​.. మీ టీవీని స్మార్ట్​టీవీగా మార్చుకోండి

టీవీఎస్​ జూపిటర్​ 125 డిజైన్​, ఇంజిన్​, మైలేజ్​...

జూపిటర్ స్కూటర్ డిజైన్​లో సీట్​ స్పేస్​పై ఎక్కువ దృష్టి పెట్టింది. దీని సీటు 110 మిల్లీమీటర్ల పొడవు, 65 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే రైడర్​తో పాటు వెనుక కూర్చునే వారికి తగినంత స్థలం ఉంటుంది. తద్వారా వెనుక వ్యక్తి కంఫర్ట్​గా కూర్చోవచ్చు. ఈ స్కూటర్​లో 128 సీసీ పెట్రోల్​ ఇంజిన్​ను సంస్థ అందించింది. ఇది 6,000 ఆర్​పీఎమ్​ వద్ద 8.3 హెచ్​పీ పవర్​, 10.5 ఎన్​ఎమ్​ వద్ద 4,500 ఆర్​పిఎమ్ టార్క్​ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్​ పాత 110 సీసీ మోడల్​ కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Aadhaar Card Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయాలా? తెలుగులో సింపుల్‌గా చేయండి ఇలా

ఈ స్కూటర్​ బేస్​ వేరియంట్ ధర రూ. 73,400 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇక దీని టాప్​ వేరియంట్​ రూ. 81,300 వద్ద ప్రారంభమవుతుంది.
Published by:Shiva Kumar Addula
First published: