హోమ్ /వార్తలు /బిజినెస్ /

TVS Jupiter Classic: కొత్త జ్యుపిటర్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

TVS Jupiter Classic: కొత్త జ్యుపిటర్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

TVS Jupiter Classic: కొత్త జ్యుపిటర్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే
(image: TVS Motors)

TVS Jupiter Classic: కొత్త జ్యుపిటర్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే (image: TVS Motors)

TVS Jupiter Classic | టీవీఎస్ జ్యుపిటర్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) నుంచి జ్యుపిటర్ క్లాసిక్ విడుదలైంది. 50 లక్షల వాహనాలను అమ్మిన సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ క్లాసిక్ మోడల్ రిలీజ్ చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

టీవీఎస్ మోటార్ కంపెనీ జ్యుపిటర్ క్లాసిక్ (Jupiter Classic) పేరుతో కొత్త మోడల్ లాంఛ్ చేసింది. ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ.85,866. వేగంగా 110సీసీ స్కూటర్ 50 లక్షల యూనిట్లు అమ్మిన సందర్భంగా ఈ కొత్త మోడల్ లాంచ్ చేసింది కంపెనీ. ఇందులో డిస్క్ బ్రేక్స్ ఫీచర్ కూడా ఉంది. టీవీఎస్ జ్యుపిటర్ క్లాసిక్ రెండు రంగుల్లో లభిస్తుంది. రీగల్ పర్పుల్, మిస్టిక్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. జ్యుపిటర్ క్లాసిక్ విశేషాలు చూస్తే 3డీ బ్లాక్ ప్రీమియం లోగో, టింటెడ్ విజర్, ఫెండర్ గార్నిష్, మిర్రర్ హైలైట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. టూవీలర్ సీట్లు కూడా ప్రీమియం లెదర్‌తో రూపొందించినవి కావడం విశేషం. కొత్త స్పీడోమీటర్ డయల్ కూడా ఉంది.

టీవీఎస్ జ్యుపిటర్ క్లాసిక్ స్కూటర్‌లో డిస్క్ బ్రేక్స్, ఇంజిన్ కిల్లర్ స్విచ్, ఆల్ ఇన్ వన్ లాక్, యూఎస్‌బీ ఛార్జర్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. టీవీఎస్ మోటార్ పేటెంట్ తీసుకున్న ఎకానామీటర్ ఫీచర్ ఇందులో ఉంది. ఇకో మోడ్, పవర్ మోడ్ సపోర్ట్ ఉంటుంది. ఇకో మోడ్‌లో ఎక్కువ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో నెక్స్‌ట్ జనరేషన్, అల్యూమినయం, లో ఫ్రిక్షన్ 110సీసీ ఇంజిన్ ఉంది.

DigiLocker: డిజీలాకర్‌లో మీ నామినీ పేరు యాడ్ చేయండి ఇలా

సరికొత్త టీవీఎస్ జ్యుపిటర్ క్లాసిక్ సమకాలీనంగా రూపొందించిన ప్రీమియం క్లాసిక్ అని, ఆన్ రోడ్‌పై 50 లక్షల వాహనాల మైలురాయిని వేగంగా చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ జ్యుపిటర్ క్లాసిక్ రూపొందించామని, టీవీఎస్ జ్యుపిటర్ లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని, ప్రేమను పొందిందని టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధా హల్దార్ అన్నారు.

Pension Scheme: అక్టోబర్ 1 నుంచి వీరికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించదు

టీవీఎస్ జ్యుపిటర్ క్లాసిక్ ఇంజిన్ ఫీచర్స్ చూస్తే ఇందులో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంది. కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్టర్ సపోర్ట్ లభిస్తుంది. హైదరాబాద్‌లో టీవీఎస్ జ్యుపిటర్ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.71,906. క్లాసిక్ మోడల్‌కు రూ.87,926. బేస్ వేరియంట్ కన్నా క్లాసిక్ మోడల్ ధర రూ.16,000 ఎక్కువగా ఉంది. టూవీలర్ లోన్ ఆఫర్ కూడా ఉంది. జీరో ప్రాసెసింగ్ ఫీజ్, 6.99 శాతం వడ్డీ రేటుతో టీవీఎస్ జ్యుపిటర్ కొనొచ్చు. స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ జ్యుపిటర్‌కు పోటీగా హోండా యాక్టీవా, సుజుకీ యాక్సెస్ 125, యమాహా రే, హీరో ప్లెజర్ లాంటి మోడల్స్ ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, SCOOTER, Tvs, Two wheeler

ఉత్తమ కథలు