Home /News /business /

TVS JUPITER ZX SMARTXONNECT SCOOTER LAUNCHED WITH BLUETOOTH CONNECTIVITY KNOW PRICE AND SPECS SS

TVS Jupiter ZX: టీవీఎస్ జ్యుపిటర్ కొత్త మోడల్ వచ్చేసింది... వాయిస్ అసిస్టెంట్, మరెన్నో ఫీచర్స్

TVS Jupiter ZX: టీవీఎస్ జ్యుపిటర్ కొత్త మోడల్ వచ్చేసింది... వాయిస్ అసిస్టెంట్, మరెన్నో ఫీచర్స్
(image: TVS Motors)

TVS Jupiter ZX: టీవీఎస్ జ్యుపిటర్ కొత్త మోడల్ వచ్చేసింది... వాయిస్ అసిస్టెంట్, మరెన్నో ఫీచర్స్ (image: TVS Motors)

TVS Jupiter ZX | స్మార్ట్ ఫీచర్స్‌తో టీవీఎస్ మోటర్స్ నుంచి టీవీఎస్ జ్యుపిటర్ జెడ్ఎక్స్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ స్కూటర్ లాంఛ్ అయింది. ఈ స్కూటర్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? టీవీఎస్ మోటార్స్ నుంచి టీవీఎస్ జ్యుపిటర్ జెడ్ఎక్స్ (TVS Jupiter ZX) మోడల్ లాంఛ్ అయింది. గతేడాది అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌లో 125సీసీ మోడల్ లాంఛ్ చేసిన టీవీఎస్ మోటార్స్... లేటెస్ట్‌గా టీవీఎస్ జ్యుపిటర్ జెడ్ఎక్స్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ లాంఛ్ చేసింది. టీవీఎస్ జ్యుపిటర్ భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న స్కూటర్లలో ఒకటి. హైటెక్ ఫీచర్స్, డిజిటల్ కన్సోల్‌ లాంటి అనేక ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ ధర రూ.80,973. టీవీఎస్ జ్యుపిటర్ నాన్ బ్లూటూత్ వర్షన్ రూ.3,000 తక్కువకే లభిస్తుంది. రూ.77,973 ధరకే కొనొచ్చు. ఇక టీవీఎస్ జ్యుపిటర్ బేసిక్ షీట్ మెటల్ వీల్ వర్షన్ ధర రూ.67,198.

    జ్యుపిటర్ జెడ్ఎక్స్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ స్కూటర్‌లో వాయిస్ అసిస్టెంట్ (Voice Assistant) ఫీచర్ ఉండటం విశేషం. ఇప్పటికే టీవీఎస్ జ్యుపిటర్ గ్రాండే ఎడిషన్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. కానీ... టీవీఎస్ జ్యుపిటర్ జెడ్ఎక్స్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ మోడల్‌లో వాయిస్ అసిస్టెంట్ ఉండటం విశేషం. దీంతో పాటు డిజిటల్ కన్సోల్, నేవిగేషన్ ఫీచర్ కూడా ఉన్నాయి.

    SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

    స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ ఫీచర్‌తో ఎస్ఎంఎస్ అలర్ట్స్, కాల్ అలర్ట్స్ పొందొచ్చు. డిజిటల్ కన్సోల్ పైన కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కనిపిస్తుంటాయి. టీవీఎస్ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్స్ కనెక్ట్ చేయొచ్చు. టీవీఎస్ కనెక్ట్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. స్కూటర్‌కు ఫోన్ పెయిర్ చేసిన తర్వాత హెడ్‌సెట్ ద్వారా వాయిస్ కమాండ్స్ లభిస్తాయి. దగ్గర్లో పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

    CNG Cars: సీఎన్‌జీ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

    టీవీఎస్ జ్యుపిటర్ ఇతర వేరియంట్ల మధ్య తేడా గుర్తించేందుకు జెడ్ఎక్స్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ స్కూటర్‌కు స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ స్టిక్కర్ ఉంటుంది. దీంతో పాటు సిల్వర్ ఇన్నర్ అప్రాన్ ప్యానెల్ ఉంటుంది. స్కూటర్ వెనుక కూర్చున్నవారికి కంఫర్ట్ కోసం వెనుకవైపు నుంచి చిన్న బ్యాక్‌రెస్ట్ ఉంటుంది. టీవీఎస్ జ్యుపిటర్ జెడ్ఎక్స్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ రెండు కలర్స్‌లో లభిస్తుంది. కాపర్ బ్రాంజ్, మ్యాటీ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

    టీవీఎస్ నుంచి లభిస్తున్న స్కూటర్స్ విషయానికి వస్తే టీవీఎస్ జ్యుపిటర్ 125, టీవీఎస్ ఎన్‌టార్క్, టీవీఎస్ జెస్ట్ 110, టీవీఎస్ స్కూటీ పెప్+ లాంటి మోడల్స్ ఉన్నాయి. వీటిలో టీవీఎస్ స్కూటీ పెప్+ తక్కువ ధరకే లభించే స్కూటర్.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Auto News, SCOOTER, Tvs, Two wheeler

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు