Electric Scooter: బజాజ్​ చేతక్​ను దాటేసిన టీవీఎస్​ ఐక్యూబ్ అమ్మకాలు

Electric Scooter: బజాజ్​ చేతక్​ను దాటేసిన టీవీఎస్​ ఐక్యూబ్ అమ్మకాలు

TVS iqube Vs Bajaj Chetak | ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో బజాజ్ చెతక్, టీవీఎస్ ఐక్యూబ్ మధ్య గట్టి పోటీ ఉంది. మార్చిలో జరిగిన అమ్మకాల్లో బజాజ్ చెతక్‌ను దాటేసింది టీవీఎస్ ఐక్యూబ్.

  • Share this:
పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలు, పర్యావరణ హాని కారణంగా ఇప్పుడు వాహనదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. గత కొద్ది కాలంగా ఎలక్ట్రిక్​ వాహనాల డిమాండ్​ పెరగడమే దీనికి నిదర్శనం. వీటి డిమాండ్​ పెరుగుతుండటంతో ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ప్రముఖ కంపెనీలతో పాటు కొత్త స్టార్టప్​ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్​ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించడం, కంపెనీలకు రాయితీలు అందిస్తుండటం వంటివి ఎలక్ట్రిక్​ వాహనాల వృద్ధికి కలిసొచ్చింది. దీంతో భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్​ వాహనాల జోరు కొనసాగనుంది. అయితే, పెట్రోల్​, డీజిల్​ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్​ వాహనాల మధ్య పోటీ తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఎలక్ట్రికల్​ వాహన తయారీ పరిశ్రమ విస్తృతం అవ్వాల్సిన అవసరం ఉంది.

దేశంలో ఛార్జింగ్​ స్టేషన్లు ఇంకా విస్తృతం కాకపోవడం ఎలక్ట్రిక్​ వాహనాల వృద్దికి ప్రతిరోధకంగా మారింది. అయినప్పటికీ, కొన్ని ప్రధాన వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఎలక్ట్రిక్​ వాహనాల విభాగంలో రెండు ప్రధాన ద్విచక్ర వాహన తయారీ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. వాటిలో ఒకటి టివిఎస్ మోటార్ కాగా, మరొకటి బజాజ్ చేటక్. ఈ రెండూ ఎలక్ట్రిక్ స్కూటర్​ విభాగంలో పోటీపోటీగా అమ్మకాలను కనబరుస్తున్నాయి.

EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ మధ్య గట్టిపోటీ


ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లు దాదాపు ఒకే సమయంలో ప్రారంభించబడ్డాయి. కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభానికి కొన్ని నెలల ముందే ఈ రెండు భారత మార్కెట్​లోకి లాంఛ్​ అయ్యాయి. అయితే, వీటి అమ్మకాలు అందర్నీ ఆశ్చర్యానకి గురిచేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ చేతక్​ 1,395 వేల ​ అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో టీవీఎస్ ఐక్యూబ్ 1,110 యూనిట్లు అమ్మకాలను కనబర్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2021 మార్చిలో, టీవీఎస్ ఐక్యూబ్ 355 యూనిట్లను విక్రయించగా.. ఇదే సమయంలో బజాజ్​ చేతక్​ కేవలం 90 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే, బజాజ్​ చేతక్​ కంటే టీవీఎస్​ ఐక్యూబ్​ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది.

Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

భారత మార్కెట్​లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు 2020లో ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో బజాజ్ చేతక్ 2 వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఆశించిన మేర యూనిట్లను విక్రయించడంలో విఫలమైంది. అయితే, కరోనాతో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్​ పెరగడం, పెట్రోల్, డీజిల్​ రేట్లు పెరగడంతో ఎలక్ట్రికల్​ వాహనాల అమ్మకాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో, 2021 ఆర్థిక సంవత్సరం ముగింపులో బజాజ్ చేతక్​ గణనీయమైన బుకింగ్స్​ సాధించింది. బజాజ్​ చేతక్​ గత నెలలో రూ. 2,000 రుసుముతో అడ్వాన్స్​ బుకింగ్స్​ ప్రారంభించగా.. ఊహించని రెస్పాన్స్​ వచ్చింది. అయితే, డిమాండ్​​ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ఒకదశలో బుకింగ్స్​ను కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభించింది.

డిమాండ్​కు తగ్గట్లు ఉత్పత్తి పెంచడంతో పాటు మరిన్ని నగరాలకు విస్తరించాలని బజాజ్​ చేతక్​ యోచిస్తోంది. ఇందులో భాగంగానే బజాజ్ చేతక్ అమ్మకాలను త్వరలో హైదరాబాద్, చెన్నైలలో కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులకు బెంగళూరు ప్రధాన నగరంగా ఉంది. ఎలక్ట్రానిక్​ సిటీగా పేరిందిన బెంగళూరులో అనేక ఎలక్ట్రికల్​ పరికరాల తయారీ సంస్థలు ఉండటం, ముడిసరుకు సలభంగా లభించడం కలిసోచ్చే అంశాలు. అంతేకాక, పరిశ్రమలు నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం కూడా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఎలక్ట్రిక్​ వాహనాల తయారీలో దూసుకుపోతున్న హీరో మోటోకార్ప్‌ నుండి అథర్ ఎలక్ట్రిక్​ వాహనం కూడా విడుదలైంది. ఇది కూడా బజాజ్​ చేతక్​, టీవీఎస్​ ఐక్యూబ్​లకు గట్టి పోటీనిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published: