టీవీఎస్ మోటార్ కంపెనీ 2022 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ (TVS iQube S), టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ (TVS iQube ST) మోడల్స్‌ని పరిచయం చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ప్రారంభ ధర రూ.98,564 కాగా, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,08,690. ఢిల్లీలో ఫేమ్ సబ్సిడీతో కలిపి ధర ఇది. వేర్వేరు రాష్ట్రాల్లో ధర వేర్వేరుగా ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ స్కూటర్ ధర వెల్లడించాల్సి ఉంది. టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ రెండు స్కూటర్లు 33 పట్టణాల్లో అందుబాటులో ఉంది. డెలివరీ వెంటనే మొదలవుతుంది. మరో 52 పట్టణాలకు అందుబాటులోకి రానుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ మోడల్‌ను ప్రీబుక్ చేయొచ్చు.
టీవీఎస్ మోటార్ కంపెనీ రెండేళ్ల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. తమ స్కూటర్లు భారతీయ రోడ్లపై మూడు కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేసింది. ఛాయిస్, కంఫర్ట్, సింప్లిసిటీ లాంటి అంశాలకు ప్రాముఖ్యతనిస్తూ ఈ మోడల్స్‌ని రూపొందించింది కంపెనీ.
IRCTC Tours: విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్... కేవలం రూ.2,000 నుంచే
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ మోడల్ హైఎండ్ వేరియంట్. ఇందులో కూడా 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. ఫైవ్ వే జాయ్‌స్టిక్, మ్యూజిక్ కంట్రోల్, థీమ్ పర్సనలైజేషన్, ప్రొయాక్టీవ్ నోటిఫికేషన్స్, వెహికిల్ హెల్త్ లాంటి ఫీచర్స్‌తో పాటు 4జీ టెలీమ్యాటిక్స్, ఓటీఏ అప్‌డేట్స్, ఇన్ఫినైట్ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, టీవీఎస్ ఐక్యూప్ అలెక్సీ స్కిల్‌సెట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. నాలుగు కలర్స్‌లో కొనొచ్చు. సీటు కింద రెండు హెల్మెట్స్ స్టోర్ చేయొచ్చు. 32లీటర్ల వరకు స్టోరేజ్ చేయొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 950వాట్ ఛార్జర్‌తో మూడు గంటల్లో, 650వాట్ ఛార్జర్‌తో నాలుగున్నర గంటల్లో ఛార్జింగ్ చేయొచ్చు.
Govt Scheme: జస్ట్ రూ.12 చెల్లించండి... రూ.2,00,000 ప్రయోజనం పొందండి
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ మిడ్ రేంజ్ వేరియంట్. 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. ఫైవ్ వే జాయ్‌స్టిక్, మ్యూజిక్ కంట్రోల్, థీమ్ పర్సనలైజేషన్, ప్రొయాక్టీవ్ నోటిఫికేషన్స్, వెహికిల్ హెల్త్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. నాలుగు కలర్స్‌లో కొనొచ్చు. ఇందులో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 950వాట్ ఛార్జర్‌తో మూడు గంటల్లో, 650వాట్ ఛార్జర్‌తో నాలుగున్నర గంటల్లో ఛార్జింగ్ చేయొచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ 2022 బేస్ వేరియంట్. 5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. మూడు కలర్స్‌లో కొనొచ్చు. ఇందులో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Electric bike, Electric Bikes, Electric Scooter, Electric Vehicles, Tvs